క‌రోనాపై ఆ ముగ్గురు సీఎంలు ఒకే మాట‌..ఒకే బాట‌!

Covid - 19

క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఆరంభ ద‌శ‌లో ఉన్న‌ప్పుడు తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులిద్ద‌రు కేసీర్ఆర్, జ‌గ‌న్మోహాన్ రెడ్డి క‌లిసి క‌ట్టుగా ఒకే మాటపై నిలిచిన సంగ‌తి తెలిసింది. ఆ వైర‌స్ ఓ చిన్న జ్వ‌రం లాంటింది. పారాసిట్ మాల్ మాత్ర వేసుకుంటే జ్వ‌రం మ‌టు మాయమైపోతుంద‌ని నోరు జారి..వైర‌స్ ని చాలా తేలిక‌గా తీసి పారేసారు. త‌ర్వాత అదే సీఎంల‌ను వైర‌స్ ఎలా ఒణికించిందో తెలిసిందే. దేశంలో పప్ర‌ధ‌మంగా కేసులు న‌మ‌దైన రాష్ర్టాలు గా తెలుగు రాష్ర్టాల పేర్లు ప్ర‌పంచ ఖ్యాతికెక్కాయి. అన్ని రాష్ర్టాల్లో వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతున్నా ఏపీలో మాత్రం అంత‌కంత‌కు వైర‌స్ ప్ర‌భావం పెరిగిపోయింది.

దీంతో దిగొచ్చిన సీఎంలు వైర‌స్ కోస‌మంటూ ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించి ప‌ని చేయ‌డం మొద‌లు పెట్టారు. ప్ర‌స్తుతం కొవిడ్-19పై చ‌ర్చ త‌ప్ప ఇంకే మాట లేద‌క్క‌డ‌. ఇటీవ‌లే ఏపీ సీఎం జ‌గ‌న్ కరోనా వైరస్ సుదీర్ఘకాలం పాటు ఉండే రోగమని, దానితో కలసి సహజీవనం సాగించక తప్పదని, అది వచ్చి పోయే జలుబు, జ్వరం వంటిదేనని వ్యాఖ్యానించారు. దీంతో ప్ర‌తి ప‌క్షాలు జ‌గ‌న్ పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించాయి. విప‌క్ష‌నేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైర‌స్ ను ఉద్దేశించి అలా మాట్లాడ‌టం ఏ మాత్రం స‌మంజ‌సం కాద‌ని విమ‌ర్శించారు. అటుపై ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కూడా జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను మ‌క్కీకి మ‌క్కీ దించేసారు.

కరోనాతో కాపురం చేయాల్సిందేన‌ని..అందుకు రాష్ర్ట ప్ర‌జ‌లు సిద్దంగా ఉండాల్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే వ‌ర‌కూ ఈ బాధ‌లు త‌ప్ప‌వ‌నేసారు. తాజాగా ఈ ఇద్ద‌రి సీఎంల‌ను వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాపీ కొట్టేసారు. క‌రోనా వైర‌స్ రేపో..ఎల్లుండే పోయేది కాదు. వైర‌స్ తో క‌లిసి ప్ర‌జ‌లు బ్ర‌త‌కాల్సిందేన‌న్నారు. కొంచెం తెలివి కావాలి. ఉపాయం ఉన్నాడు అపాయం నుంచి త‌ప్పించుకుంటాడు. కాబ‌ట్టి మ‌నం ఉపాయంతోనే బ్ర‌త‌కాలి. తెలివి మ‌నం సంపాదించుకోవాలని రెండు మాటలు ఎక్కువే చెప్పారు. మొత్తానికి ఈ ముగ్గురు సీఎంల‌కు క‌రోనా వ్యాప్తి గురించి…దాన్ని ఎదుర్కోవ‌డంపై పూర్తిగా ఓ క్లారిటీ అయితే వ‌చ్చింద‌ని నేటి జ‌నులు కామెంట్లు గుప్పిస్తున్నారు. ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు. బాట కూడా ఒకేలా ఉండేని ఆశిద్దాం అంటున్నారు.