రాజకీయాల్లోకి వచ్చే వాళ్లు ఎవరైనా ఉన్నత పదవులు పొందాలని అనుకుంటారు. పవన్ కళ్యాణ్ కు కూడా సీఎం కావాలనే ఆశ ఉంది. అయితే ఆ ఆశ నెరవేరాలంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఒంటరి పోరాటం చేయాల్సి ఉంది. ఒంటరి పోరాటం చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ ఐదేళ్లు ఆలస్యంగానైనా పార్టీని అధికారంలోకి తెచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ విషయంలో పవన్ రాజీ పడితే మాత్రం నష్టపోక తప్పదు.
పవన్ కళ్యాణ్ ఇతర పార్టీలతో పొత్తులకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా సేవకుడిగానే మిగిలిపోయే ఛాన్స్ అయితే ఉంది. తెలుగుదేశం ఇచ్చే 20 సీట్ల కోసం ఆశ పడటం కంటే జనసేన 175 స్థానాలలో పోటీ చేస్తే బాగుంటుంది. టీడీపీ, వైసీపీలపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో పవన్ ఫెయిల్ అవుతున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
సీఎం కావాలంటే అదొక్కటే పవన్ కు ఉన్న ఆప్షన్ అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ వయస్సు ప్రస్తుతం 51 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. 70 సంవత్సరాల లోపు సీఎం కాకపోతే పవన్ కళ్యాణ్ ఎప్పటికీ సీఎం అయ్యే అవకాశం ఉండదు. అద్భుతమైన అవకాశాలను మిస్ చేసుకుంటే తర్వాత బాధ పడినా ఫలితం ఉండదు. ఈ విషయాలను పవన్ గమనిస్తే మంచిదని చెప్పవచ్చు.
తను చేస్తున్న తప్పులు, పొరపాట్లు చిన్నవే అయినా వాటి వల్ల ఎదురయ్యే ఇబ్బందులు మాత్రం మామూలుగా ఉండవు. టీడీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పవన్ కళ్యాణ్ పై కూడా ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. వైసీపీకి పవన్ ప్రత్యామ్నాయం అయితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.