టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి కాకుండా కృష్ణాజిల్లాలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశాలున్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే చాలా మంది ఈ విషయాన్ని అప్పట్లో కొట్టిపారేశారు. చంద్రబాబుకు కుప్పం కంచుకోట అని.. అక్కడ నుంచి తప్పుకునే అవకాశమే లేదని అన్నారు.
అయితే… స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఎదురైన పరాభవాలు.. కుప్పం మునిసిపాలిటీని కోల్పోయిన సంగతి వంటివి బాబుని పునరాలోచనలో పాడేశాయని అంటున్నారు. దీంతో… నియోజకవర్గ మార్పు చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో “నిజం గెలవాలి” యాత్రలో భాగంగా కుప్పంలో పర్యటించిన భువనేశ్వరి తన మనసులో మాట అంటూ… బాబు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పారని అంటున్నారు.
ఇందులో భాగంగా… ఈసారి చంద్రబాబుకి రెస్ట్ ఇచ్చి, తాను కుప్పం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు చెప్పారు భువనేశ్వరి! వాస్తవానికి ఇది చిన్న స్టేట్ మెంట్ కాదు.. సరదాగా చెప్పే విషయం అసలే కాదు. అయితే… ఈ స్టేట్ మెంట్ అనంతరం ప్రజల రియాక్షన్, కార్యకర్తల ఎక్స్ ప్రెషన్స్ ని గమనించిన భువనేశ్వరి… అనంతరం ఇది సరదా విషయం అన్నట్లుగా నవ్వి ఊరుకున్నారు. దాని వెనుక బలమైన కారణమే ఉంది.
తాను ఏదైనా కాస్త కీలక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నప్పుడు.. చంద్రబాబు ముందుగా దానిని ప్రజల్లోకి లీక్ చేయిస్తారు. కొన్ని సార్లు పత్రికలు, మరికొన్ని సార్లు నేతల నుంచి ఆ పనికి పూనుకుంటారు. అనంతరం… ప్రజలు ఆ నిర్ణయం గురించి ఏం అనుకుంటున్నారు.. వారి స్పందన ఎలా ఉంది అనే విషయాన్ని గమనిస్తారు. దానిని బట్టి తుది నిర్ణయం తీసుకుని, అప్పుడు తాను అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటిస్తారు. ఇది బాబు స్టైల్!!
దీంతో… ఇప్పుడు కుప్పం నుంచి షిఫ్ట్ అయ్యే విషయంపైనా అలా భువనేశ్వరితో ఒక లీకు ఇప్పించిన చంద్రబాబు…. రియాక్షన్ కాస్త భువనేశ్వరికి కూడా అనుకూలంగానే వచ్చినట్లు భావిస్తున్నారని అంటున్నారు. దీంతో… చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని తన భార్యకోసం అన్నట్లుగా విడిచి పెట్టి.. బాబు సెకండ్ ఆప్షన్ కి వెళ్తున్నారనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బలంగా నడుస్తుంది.
ఈ క్రమంలోనే ఇతరుల కోసం చంద్రబాబు కుప్పాన్ని వదిలితే అది భయానికి సూచనగా ఉంటుందని ఆలోచిస్తున్న నేపథ్యంలో… తన భార్య కోసం ఆ సీటును త్యాగం చేస్తే.. దాన్ని ప్రజలు పాజిటివ్ గా తీసుకునే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. ఆ విధంగా కుప్పాన్ని భువనేశ్వరికి వదిలిపెట్టిన చంద్రబాబు… ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. మరి బాబు ఫైనల్ డెసిషన్ ఏమిటనేది వేచి చూడాలి!