చిరంజీవి మాటలకు పవన్ పనులకు పొంతన ఉందా.. అర్థం కాలేదేమో?

చిరంజీవి, పవన్ కళ్యాణ్ భిన్న ధృవాలు అనే సంగతి తెలిసిందే. చిరంజీవి రాజకీయాల్లో మెరుగైన ఫలితాలు సాధించినా వేర్వేరు కారణాల వల్ల ఎక్కువ సంవత్సరాల పాటు రాజకీయాల్లో కెరీర్ ను కొనసాగించడానికి ఆసక్తి చూపించలేదనే సంగతి తెలిసిందే. గతంలో పవన్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడిన చిరంజీవి తాజాగా మరో సందర్భంలో మాట్లాడుతూ పవన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

రాజకీయాల్లో సెన్సిటివ్ గా ఉంటే రాణించడం కష్టం అని చిరంజీవి కామెంట్లు చేశారు. రాజకీయాల్లో అవసరం ఉన్నా లేకపోయినా మాటలు అనాలని అదే సమయంలో అనిపించుకోవాలని చిరంజీవి చెప్పుకొచ్చారు. రాజకీయాలకు పవన్ కళ్యాణ్ తగినవాడు అని చిరంజీవి కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ అంటాడని అనిపించుకుంటాడని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ప్రజల ఆశీస్సులతో పవన్ ఏదో ఒకరోజు అత్యుత్తమ స్థానంలో నిలుస్తారని చిరంజీవి కామెంట్లు చేశారు.

అయితే చిరంజీవి మాటలకు పవన్ చేసే పనులకు పొంతన ఉందా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ సాధించిన స్థాయిలో జనసేన సీట్లు సాధించడం సాధ్యమేనా అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇతర పార్టీలతో పొత్తు లేకుండా జనసేన ఉనికిని చాటుకునే అవకాశం ఉందా? అని మరి కొందరు ప్రశ్నిస్తుండటం గమనార్హం. ఈ ప్రశ్నలకు పవన్ దగ్గర కానీ చిరంజీవి దగ్గర కానీ సమాధానం ఉండదు.

తను చెప్పిన మాటలపై, ఇచ్చిన వాగ్దానాలపై పవన్ కళ్యాణ్ నిలబడగలరా? అనే ప్రశ్నకు సైతం నిలబడరు అనే సమాధానం వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అవుతారని ప్రజలు నమ్ముతున్నారా? అనే ప్రశ్నకు సైతం కాదనే సమాధానం వినిపిస్తోంది.