జూ ఎన్టీఆర్ ను సీఎం చెయ్యి బాబు.. ఇంతకంటే మంచి ఆప్షన్ ఉందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. అయితే చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించేది ఎవరు అనే ప్రశ్నకు లోకేశ్ పేరు సమాధానంగా వినిపిస్తోంది. అయితే లోకేశ్ సీఎం కావడం విషయంలో అటు ప్రజలు కానీ ఇటు టీడీపీ కార్యకర్తలు, నేతలు కానీ సంతృప్తితో లేరు. లోకేశ్ కు బాధ్యతలు అప్పగిస్తే టీడీపీకి నష్టమే తప్ప లాభం ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అలా కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ను సీఎం చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తే మాత్రం పార్టీకి కచ్చితంగా బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. టీడీపీకి కాకుండా తారక్ మరో పార్టీకి మద్దతు ఇస్తే మొదట నష్టపోయే వ్యక్తి చంద్రబాబు అని చెప్పవచ్చు. తారక్ మరో పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల టీడీపీ ఓట్లు చీలిపోయే అవకాశం కూడా ఉంటుంది. కెరీర్ విషయంలో తారక్ ప్రస్తుతం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తారక్ ప్రస్తుతం టీడీపీలో యాక్టివ్ అయ్యేలా చంద్రబాబ్ జాగ్రత్తలు తీసుకుంటే అది చంద్రబాబు భవిష్యత్తుకే మంచిది. తారక్ మరో పార్టీకి మద్దతు ఇచ్చి టీడీపీలో తనకు ఎదురైన అవమానాల గురించి వెల్లడిస్తే మాత్రం పోయేది టీడీపీ పరువేననే సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైలెంట్ ఉన్నంత వరకు మాత్రమే తెలుగుదేశం పార్టీకి మంచి జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

తారక్ ప్రస్తుతం సినిమాల పరంగా ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. అయితే తారక్ వెల్లడించకపోయినా రాజకీయాలలో సంచలనాలు సృష్టించాలని తారక్ మనసులో ఉంది. తారక్ రాబోయే రోజుల్లో తన మనస్సులో ఉన్న కోరికను కచ్చితంగా నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు. 2029 ఎన్నికల్లో తారక్ సత్తా చూపే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాసినిమాకు తారక్ కు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.