ఆ ఒక్క తప్పుతో జగన్ పతనం మొదలైందా.. అలాంటి కీర్తి అవసరమా?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలను అమలు చేయగా ఆ పథకాలపై ప్రజల నుంచి పాజిటివ్ కామెంట్లు వినిపించాయి. ప్రజలకు నచ్చని నిర్ణయాలు జగన్ తీసుకోవడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. అయితే ఒకే ఒక్క తప్పుతో జగన్ పతనం మొదలైందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును జగన్ మార్చడం సరికాదని రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

పలువురు తమ పదవులకు రాజీనామా చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలలోనే చాలామందికి ఈ నిర్ణయం నచ్చకపోవడం గమనార్హం. రాబోయే రోజుల్లో పుట్టబోయే పిల్లలకు సైతం జగన్ పేరు పెట్టాలని డిమాండ్ వస్తుందేమో అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పేరు మార్పు బిల్లును వల్లభనేని వంశీ మోహన్ సైతం పరోక్షంగా వ్యతిరేకించారు. సీనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే అభిమానులెవరికీ ఈ నిర్ణయం నచ్చదు.

జగన్ సర్కార్ కు ఇలా పేరు మార్చడం ద్వారా వచ్చే కీర్తి అవసరమా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్ పేరు విషయంలో వెనక్కు తగ్గని పక్షంలో ప్రజల నుంచి కూడా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పవచ్చు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం జగన్ సర్కార్ కు ఏ మాత్రం మంచిది కాదని చెప్పవచ్చు. జగన్ కు ఇలాంటి సలహాలు ఎవరు ఇస్తున్నారో తెలియదు కానీ పార్టీకి ఈ తరహా నిర్ణయాలు ఎంతగానో చేటు చేస్తాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

కొన్ని విషయాలకు సంబంధించి జగన్ సర్కార్ మారాల్సి ఉందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరో పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వైఎస్సార్ పేరు లేకుండా చేసే అవకాశం ఉంది. ఇలాంటి చెత్త సాంప్రదాయానికి జగన్ శ్రీకారం చుట్టడం రాష్ట్ర భవిష్యత్తుకు ఏ మాత్రం మంచిది కాదు. ఈ విషయంలో కనీసం వైసీపీ నేతల అభిప్రాయాలను జగన్ పరిగణిస్తే బాగుంటుందని చెప్పవచ్చు.