పోలీస్ స్టేషన్ కే కన్నం వేసిన దొంగలు…. ఏమి ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సాధారణంగా ఇళ్లల్లో, దుకాణాలలో, దేవాలయాలలో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇటీవల పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగిన ఘటన సంచలనంగా మారింది. దొంగతనాలు తిరగకుండా అడ్డుకోవాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఏకంగా పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దొంగతనం జరగడానికి కూడా ఒక హెడ్ కానిస్టేబుల్ కారణమని తెలియడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

వివరాలలోకి వెళితే…అనకాపల్లి జిల్లా కే కోటపాడు పోలీస్ స్టేషన్ లో ఈ దొంగతనం జరిగింది. అయితే ఇలా పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగిన విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందనే భయం ఒకవైపు ఉంటే.. స్టేషన్ లో మాయమైన గంజాయి ఏమయ్యిందో అనే ఆలోచన పోలీసులను తెగ టెన్షన్ పెట్టింది. అయితే మొత్తానికి విషయం పై అధికారులకు తెలియడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ వల్లే ఈ దొంగతనం జరిగిందని బయట పడింది. కానిస్టేబుల్ ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయట పెట్టాడు.

కే కోటపాడు పోలీసు స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కే శ్యామ్ కుమార్ సహకారంతో నలుగురు యక్తులు పోలీసు స్టేషన్‌లోకి ప్రవేశించి మరి గంజాయిని ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో గంజాయి చోరీ చోరీకి పాల్పడిన నలుగురు నిందితులతో పాటు హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ కుమార్ పేరు సైతం నిందితుల్లో చేర్చినట్టు తెలుస్తోంది. దొంగతనాలు జరగకుండా అడ్డుకోవాల్సిన పోలీసులు ఇలా దొంగల చేతికి తాళాలు ఇచ్చి మరి దొంగతనాలు చేయించడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. డబ్బు కోసం ఆశపడి గౌరవప్రదమైన పోలీస్ వృత్తిలో ఉంటూ ఆ వృత్తికి కళంకం తెచ్చేలా వ్యవహరించడంతో సదరు కానిస్టేబుల్ పైన కేసు నమోదు చేయడమే కాకుండా అతనిని ఉద్యోగం నుండి కూడా తొలగించారు.