పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని చాలామంది ఒక రాజకీయ పార్టీలా కూడా గుర్తించడం లేదు. జనసేన పార్టీ వల్ల ప్రజల కంటే ఇతర రాజకీయ పార్టీలకే ఎక్కువ ఉపయోగం అని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తారనే సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటారో ఎప్పుడు రాజకీయాలతో బిజీగా ఉంటారో ఎవరూ చెప్పలేరు.
ఒక రాజకీయ పార్టీకి అవసరమైన లక్షణాలు జనసేనలో ఉన్నాయా? అనే ప్రశ్నకు సైతం కాదనే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం. జనసేన ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించినా ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి బలమైన నేతలు ఉన్నారా? అనే ప్రశ్నకు నో అనే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం. జనసేనలో నాగబాబుకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత లేదనే విషయం తెలిసిందే.
సినిమాల్లో అంతోఇంతో సక్సెస్ అయిన నాగబాబు రాజకీయాల్లో మాత్రం సక్సెస్ కాలేకపోయారు. నాగబాబుకు ఈ మధ్య కాలంలో అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. 2024 ఎన్నికల్లో ఓటమిపాలైతే టీడీపీ జనసేన రెండు పార్టీలకు ఏపీలో ఉనికి ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాటల్లో ఉన్న పవర్ చేతల్లో లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జనసేన ఏపీలో అధికారంలోకి రావడం అసాధ్యమని కామెంట్లు వినిపిస్తున్నాయి. జనసేన చేస్తున్న చిన్నచిన్న తప్పులు ఆ పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం కలిగిస్తున్నాయి. జనసేనను రాజకీయ పార్టీ అంటే ఎవరైనా నమ్ముతారా? అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.