ఏపీ రాజకీయాలలో రోజుకో మలుపు చోటు చేసుకుంటోంది. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతున్నా టీడీపీ, జనసేన పుంజుకోవడం లేదు. బీజేపీ ఏపీలో పుంజుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ఆ ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం దక్కడం లేదు. ఏపీ కాంగ్రెస్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఏపీ ప్రజలు సైతం దాదాపుగా ఏపీ కాంగ్రెస్ గురించి మరిచిపోయారు.
చంద్రబాబు తాను ముఖ్యమంత్రి కావడానికి మరో ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీకే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైతే రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో మారుతున్న పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
లోకేశ్, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఒకే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జనసేన సోలోగా పోటీ చేస్తే ఆ పార్టీ ఎప్పటికీ గెలిచే అవకాశం లేదు. టీడీపీతో కలిసి జనసేన పోటీ చేసినా టీడీపీ జనసేనకు భారీ స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయని ఉంటాయని చెప్పవచ్చు. అయితే రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.
జగన్ సీఎం అవుతారని 15 సంవత్సరాల క్రితం ఎవరూ ఊహించలేదు. రాజశేఖర్ రెడ్డి కొడుకు కావడం వల్లే జగన్ సీఎం కావడం సాధ్యమైందని చాలామంది భావిస్తారు. 2024లో జగన్ అధికారంలోకి రాకూడదని భావిస్తున్న వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. జగన్ సర్కార్ పై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉండటం గమనార్హం.