సాఫ్ట్ వేర్ భార్య ఎఫైర్, సాఫ్ట్ వేర్ భర్త సూసైడ్ కేసులో బయటపడ్డ మరిన్ని సంచలన నిజాలు

పంజాగుట్టలో ఆత్మహత్య చేసుకున్న సాప్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ కేసులో రోజుకో సంచలన నిజాలు బయటికొస్తున్నాయి. ప్రశాంత్ భార్య పావని వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ప్రశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రశాంత్ ఆత్మహత్యకు పావనినే కారణమని నిర్ధారించిన పోలీసులు పావనిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసుల విచారణలో పలు సంచలన నిజాలు వెలువడ్డాయి.

కామారెడ్డి జిల్లాకు చెందిన తిరునగరి ప్రశాంత్ సిలికాన్ ఇమేజ్ సాప్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతనికి 2014లో వరంగల్ జిల్లాకు చెందిన పావనితో వివాహం జరిగింది. వీరు శ్రీనగర్ కాలనీలోని పద్మజ మెన్షన్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. పావని కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేది.  

ప్రశాంత్ ఫ్రెండే ప్రణయ్. ప్రణయ్ కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. ప్రణయ్ టెక్నాలజీ ఉపయోగించడంలో దిట్ట. ప్రశాంత్ తో దోస్తి కోసం ఇంటికి వచ్చే ప్రణయ్ తో పావనికి కూడా పరిచయం ఏర్పడింది. ఏమైనా వృత్తిపరమైన సమస్యలు ఉంటే పావనికి ప్రణయ్ హెల్ప్ చేసేవాడు. ఇలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ప్రశాంత్ కు అనుమానం రాకుండా మామూలుగానే ఉండేవారు. ఇలా వారిద్దరి పరిచయం ఫోన్ కాల్స్, చాటింగ్ వరకు వెళ్లింది.

పావని కూడా హైదరాబాద్ లోనే జాబ్ చేస్తుండటంతో ఎప్పుడు ఆఫీసు పనిమీదనే బిజిగా ఉన్నట్టు కనిపించేది. పావని ప్రవర్తనలో మార్పు గమనించిన ప్రశాంత్ పావనిని జాబ్ బంద్ చేయించాడు. దీంతో ఇక ఇంట్లోనే ఉన్న పావని ప్రశాంత్ ని మానసికంగా వేధించేది. ఎప్పుడు ఫోన్లు బిజిగా రావడం, వాట్సాప్, వీడియో కాలింగ్ లలో ఉండటంతో ప్రశాంత్ కు అనుమానం ఎక్కువైంది.

పావనికి తెలియకుండా ఇంట్లో సిసి కెమెరాలు పెట్టించాడు. పావని ఫోన్లో ఆడియో రికార్డులు సెట్ చేశాడు. అలాగే పావనికి ఫోన్ రాగానే ప్రశాంత్ కు కూడా తెలిసి ఆమె మాట్లాడే మాటలు అన్ని వినేలా సెట్ చేశాడు. దీంతో అతనికి పావని గురించి విస్తుపోయే నిజాలు తెలిశాయి.

పావని ఎప్పుడు ప్రణయ్ తోనే ఫోన్, చాటింగ్, వీడియో కాల్స్ మాట్లాడేది. ప్రశాంత్ జాబ్ కు పోగానే ప్రణయ్ ఇంటికి వచ్చేవాడు. ప్రణయ్ కూడా జాబ్ చేసేవాడు కావడంతో ప్రశాంత్ డ్యూటి సమయానికి అనుగుణంగా ప్రణయ్ తన షిప్టులను వేయించుకునేవాడు. ఇంట్లోనే వారు చేసే సరసాలన్నీ ప్రశాంత్ సిసి టివిలో చూశాడు. ఇంట్లోనే భార్య తన ఫ్రెండ్ తో సరసాలు ఆడటం చూసి ప్రశాంత్ షాక్ తిన్నాడు. తన పరువు పోవద్దని భార్యలోనే మార్పు తీసుకొచ్చేందుకు నిర్ణయించుకున్నాడు. అయినా కూడా ఏం తెలియనట్టు నటించి భార్యలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. స్నేహితుడు ప్రణయ్ ని దూరం పెట్టాడు.

ప్రణయ్ ని ప్రశాంత్ ఇంటికి రాకుండా చేయడంతో ఎందుకు అలా చేస్తున్నావ్.. ఏమైంది అంటూ పావని ప్రశాంత్ కి ఎక్కువ టార్చర్ పెట్టింది. ఇక వీరి  ఆగడాలు చూడలేక ప్రశాంత్ పావనిని బెంగుళూరుకు జాబ్ పై పంపాడు. అయినా కూడా వారి సంబంధం తెగలేదు, పావనిలో మార్పు రాలేదు. ప్రశాంత్ కూడా బెంగుళూరు వెళ్లి అక్కడే సెటిల్ కావాలని చూశాడు.

 పావని, ప్రణయ్ ల ఫోన్ కాల్స్, సిసి టివిలో వారి సరసాలు చూసిన ప్రశాంత్ రోజురోజుకు మానసికంగా కుంగిపోయాడు. ఇక ఓపిక నశించిన ప్రశాంత్ పావనిని అసలు విషయం అడిగేశాడు. అంతే పావని ఏ మాత్రం భయం లేకుండా ఇష్టమైన వాళ్లతో క్లోజ్ గా మూవ్ కావడం తప్పా అంటూ ప్రశాంత్ ని ప్రశ్నించింది. తన స్నేహితుడు తమ జీవితాలను ఆగం చేస్తాడు అనుకోలేదు అంటూ ప్రశాంత్ బాధ పడితే.. వాడేం చేయలే నువ్వే వేస్టుగాడివి అంటూ పావని ప్రశాంత్ ని అవమాన పరిచింది.

తాను ప్రణయ్ తో ఉంటానని, నీతో కూడా ఉంటానని పావని ప్రశాంత్ కి ఆఫర్ ఇచ్చింది. తాను ఇద్దరితో ఉంటా నీ  ఇష్టం ఆలోచించుకో అంటూ అతనికి హెచ్చరిక సంకేతాలు పంపింది. కట్టు కున్న భార్య ఇంతలా బరితెగించడంతో తానిక బతకలేనని ప్రశాంత్ నిర్ణయానికి వచ్చాడు. ముందుగా బావకు ఫోన్ చేసి తాను చనిపోతానని చెప్పాడు. ఆ తర్వాత పావనితో కూడా చెప్పగా చావు… ఎవరు బతకమంటుర్రు అంటూ హేళనగా మాట్లాడింది.

వీటన్నింటి నేపథ్యంలో తనకు చావే శరణ్యమనుకున్న ప్రశాంత్ తాను నివాసం ఉంటున్న ఫ్లాట్ లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రశాంత్ ఆత్మహత్యకు పావనినే కారణమని రుజువు కావడంతో పోలీసులు పావనిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పావని చేసిన పనిని చూసి అంతా విమర్శించారు. 

  పావని ప్రశాంత్ ల ఆడియో టేపు కింద ఉంది వినండి. 

https://www.youtube.com/watch?v=YmEt3IxVSNs

 

‘సవ్యసాచి’టాక్: ప్లస్ లు ఏంటి..మైనస్ లు ఏంటి?