వివాహం తర్వాత పిల్లల్ని కనాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. కొంతమందికి వివాహం జరిగిన కొంతకాలానికి పిల్లలు పుడితే మరికొంతమందికి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పిల్లలు పుడతారు. అయితే మరి కొంతమందికి ఎన్ని సంవత్సరాలు పుట్టారని తెలిసి ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇలా పిల్లలు కలగని కొంతమంది స్త్రీలకు వారి బట్టలు విడాకులు ఇచ్చి వేరొక వివాహం చేసుకుంటూ ఉంటారు. అయితే మరి కొంత మంది మాత్రం పిల్లలు పుట్టని పాపానికి మహిళల్లో అత్యంత దారుణంగా వేధిస్తూ ఉంటారు. తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బతికుండగానే అత్తింటి తరపు వారు ఆ మహిళకు నరకం చూపించిన ఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపుతోంది.
వివరాలలోకి వెళితే…. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చందోలి గ్రామానికి చెందిన లాలప్ప, ఆదిలక్ష్మిల దంపతులకు ఓ కుమార్తె . ఆమెను డోన్ మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన రాముకు ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే.. పెళ్లి అయినప్పటి నుంచి అత్తింటివారు ఆమెను తరచూ వేధిస్తూ ఉండేవారు. అంతేకాకుండా పెళ్లి జరిగి మూడు సంవత్సరాలు దాటినా కూడా సంతానం కలగకపోవటంతో దాన్ని అదునుగా చేసుకొని ఆ మహిళను మరింత దారుణంగా హింసించేవారు. అతిథి వారితో పాటు భర్త కూడా ఆమెను చిత్రహింసలకు గురి చేసేవాడు. అయినా కూడా ఆ మహిళ ఆ బాధలను భరిస్తూ ఆపిట్లోనే ఉండిపోయింది.
ఇలా సంతానం కలగలేదని రోజు రోజుకి మరి దారుణంగా చిత్రహింసలు పెట్టేవారు. అంతే కాకుండా విచక్షణారహితంగా కొట్టి, కాలు, చేయి విరిచేశారు. అయితే చుట్టుపక్కల వారి ద్వారా తమ కూతురు పరిస్థితి గురించి తెలుసుకున్న ఆ మహిళ తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని తమ కుమార్తెలు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళను పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించినా ఆరోగ్యం మెరుగుపడకపోవటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో సదరు మహిళ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.