‘విశాఖ స్టీల్ ప్లాంట్’పై తేల్చేసిన కేంద్రం… ‘ఛలో పార్లమెంట్’కు జేఏసీ పిలుపు

The Center has not reconsidered the Visakhapatnam steel plant

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే విషయంలో కేంద్రం తన వైఖిరిని స్పష్టం చేసింది. ప్రైవేటీకరణపై కేంద్రం ఆలోచన మారుతుందేమో అని ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న ఆశల మీద కేంద్రం నీళ్లు చల్లేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ విషయంలో కేంద్రానికి పునరాలోచన లేదని తేల్చి చెప్పేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ఱయాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

The Center has not reconsidered the Visakhapatnam steel plant

కార్మిక సంఘాలు జేఎసీగా ఏర్పడి విశాఖలో రిలేదీక్షలు నిర్వహిస్తున్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించాలని కోరుతూ ఆగష్టు 1, 2 తేదీల్లో ‘ఛలో పార్లమెంట్’ కార్యక్రమానికి జేఎసీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలను కార్మిక సంఘాల జేఏసీ కోరుతోంది. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమంతో ఈ ఉద్యమం జాతీయ ఉద్యమంగా మారనుందని చెప్పారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వైసీపీ, టీడీపీ, బీజేపీ సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.