నెల్లూరు జిల్లాలో సీనియర్ నేత, కావలిలో గట్టి పట్టున్న మాజీ ఎంఎల్ఏ కాటమరెడ్డి విష్ణువర్ధనరెడ్డి నిర్వహించిన భారీ ర్యాలీ వైసిపిలో కలవరం పుట్టిస్తోంది. రాబోయే ఎన్నికల్లో టిక్కెట్టు కోసమే కాటమరెడ్డి ఒక విధంగా బలప్రదర్శన చేసినట్లుగానే ఉంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కాటమిరెడ్డి అనుకున్నారు. అయితే సిట్టింగ్ ఎంఎల్ఏ రామిరెడ్డి ప్రతాపరెడ్డి ఉన్నపుడు కాటమిరెడ్డికి టిక్కెట్టు దక్కే అవకాశం లేదు. భేటీ సందర్భంగా కాటమిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి అదే విషయాన్ని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చేసినపుడు జగన్ కు మద్దతుగా నిలబడిన కాంగ్రెస్ నేతల్లో కాటమిరెడ్డి కూడా ఒకరు. అప్పటి నుండి జగన్ మద్దతుదారుగానే ఉన్నారు. అయితే, కారణాంతరాల వల్ల పోయిన ఎన్నికల్లో కావలి టిక్కెట్టు రామిరెడ్డికి ఇవ్వాల్సొచ్చింది. అప్పుడు రామిరెడ్డి గెలవటంతో రేపటి ఎన్నికల్లో టిక్కెట్టుకు కాటమిరెడ్డికి దారులు మూసుకుపోయాయి. అప్పటి నుండి సీనియర్ నేత అసమ్మతితోనే ఉన్నారు. చివరిసారిగా రెండు రోజుల క్రితం జగన్ ను కలిసి మళ్ళీ టిక్కెట్టు అడిగారు. సిట్టింగ్ ఎంఎల్ఏని కాదని కాటమరెడ్డికి టిక్కెట్టు ఇవ్వటం కుదరదని స్పష్టం చేశారు.
జగన్ తో భేటీ తర్వాత తిరిగి నెల్లూరుకు వచ్చేసిన కాటమిరెడ్డి శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీకి కావలి నుండే కాకుండా ఉదయగిరి, కోవూరు నియోజకవర్గా నుండి కూడా మద్దతుదారులు పాల్గొన్నారు. బల ప్రదర్శన ఉద్దేశ్యంతోనే కాటమరెడ్డి ర్యాలీ నిర్వహించటంతో మిగిలిన వైసిపి నేతల్లో కలవరం మొదలైంది. మరో మాజీ ఎంఎల్ఏ వంటేరు వేణుగోపాల రెడ్డి కూడా కాటమిరెడ్డితో కలవటంతో ర్యాలీ సూపర్ సక్సెస్ అయినట్లే చెప్పుకోవాలి. పార్టీ శ్రేణుల్లో మద్దతు కలగిని కాటమరెడ్డి ఏ ఉద్దేశ్యంతో ర్యాలీ తీసినా వచ్చే ఎన్నికల్లో ప్రమాధ ఘంటికలు తప్పవా ? అన్న అనుమానాలు అందరిలోను మొదలయ్యాయి.
భారీ ర్యాలీ నిర్వహించటంలో కాటమరెడ్డి ఉద్దేశ్యం ఏమిటో ఎవరికీ తెలీలేదు. పార్టీ మారే ఉద్దేశ్యంలో ఉన్నారా ? లేకపోతే వైసిపి తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీలో ఉంటారా ? లేకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తారా ? అనే విషయంలో అందరిలోను అయోమయం మొదలైంది. పై వాటిల్లో ఏది జరిగినా వైసిపి అభ్యర్ధికి గెలుపు కష్టమనే అభిప్రాయం కూడా వైసిపి నేతల్లో చర్చ మొదలైంది. మరి కాటమిరెడ్డి చివరకు ఏం చేస్తారో చూడాల్సిందే .