టి ఫలితాలపై ఏపిలో టెన్షన్..టెన్షన్

మరికొద్ది సేపటిలో మొదలవ్వనున్న తెలంగాణా ఎన్నికల కౌటింగ్ విషయంలో ఏపిలో కూడా టెన్షన్ పెరిగిపోతోంది. తెలంగాణా ఎన్నికల ఫలితాలు ఎలాగున్నా దాని ప్రభావం ఏపిలో వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉండటమే ఈ టెన్షన్ కు కారణం. తెలంగాణాలో మహకూటమి గెలిస్తే ఒకలాగ, టిఆర్ఎస్సే మళ్ళీ అధికారంలోకి వస్తే మరోలాగ ఆంధ్రప్రదేశ్ లో ప్రభావం ఉండబోతోందనటంలో సందేహం లేదు. ముదుగా అనుకున్నట్లే మహాకూటమే గెలిస్తే ఏదో ఓ రూపంలో చంద్రబాబునాయుడు హవా మొదలవుతుంది. ఒకరకంగా తెలంగాణా ప్రభుత్వంలో బ్యాక్ సీట్ డ్రైవింగ్ ప్రారంభమవుతున్నట్లే అనుకోవాలి.

 

వచ్చే ఎన్నికల్లో ఏపిలో చంద్రబాబు అధికారం కోల్పోవటం దాదాపు ఖాయమని అన్నీ సర్వేల్లో సూచనలు అందుతున్నాయి. దాంతో చంద్రబాబుతో పాటు టిడిపి నేతలందరిలోను ఒకరకమైన ఆందోళన స్పష్టంగా కనపిస్తోంది. ఈ నేపధ్యంలోనే తెలంగాణా ఎన్నికలు రావటంతో కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోవటం ద్వారా చంద్రబాబు ఒక విధంగా రాజకీయంగా పెద్ద జూదానికి దిగినట్లే. మహాకూటమి గనుక గెలిస్తే ఏపిలో చంద్రబాబుకు కాస్త ఊరట లభించినట్లే అనుకోవాలి. ఎందుకంటే, తెలంగాణాలో కెసియార్ మళ్ళీ అధికారంలోకి వచ్చి, రేపటి ఎన్నికల్లో ఏపిలో ఓడిపోతే చంద్రబాబు పరిస్దితి చాలా దారుణంగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు.

 

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు జూదానికి దిగారన్న విషయం అందరికీ తెలిసిందే. మహాకూటమి గెలిస్తే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుకు కాస్త గౌరవం పెరుగుతుంది. అదే సమయంలో కెసియార్ గనుక మళ్ళీ సిఎం అయ్యే అవకాశాలుంటే మాత్రం చంద్రబాబులో ఆందోళన మొదలైనట్లే. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే గనుక ఏపిలో కూడా చంద్రబాబుకు కష్టకాలం మొదలవుతుంది.

 

ఎందుకంటే, కెసియార్ కు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి  మంచి సంబంధాలున్న విషయం తెలిసిందే. ఆ సంబందాల వల్ల వచ్చే ఎన్నకల్లో ఏపిలో జగనే సిఎం కావాలని కెసియార్ అండ్ కో కోరుకోవటంలో తప్పులేదు. అందుకు తగ్గట్లే జగన్ కు కెసియార్ సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అనుకోవాలి.  అందుకే తెలంగాణా ఎన్నికల ట్రెండ్స్ పై ఏపిలో రాజకీయంగానే కాకుండా మామూలు జనాల్లో కూడా టెన్షన్ పెరిగిపోతోంది,