కొట్టుకున్న లేడీ జర్నలిస్టులు.! ఇదేం దిగజారుడుతనం.?

ఇద్దరు తెలుగు న్యూస్ ఛానళ్ళ జర్నలిస్టులు నిస్సిగ్గుగా కొట్టుకున్నారు. ఇంటర్వ్యూల విషయంలో ఇద్దరికీ మధ్య గొడవ మొదలైందట. ‘నువ్వు ఎక్కువ సేపు ఇంటర్వ్యూలు చేస్తావ్.. మేం ఎంత సేపు వేచి చూడాలి.? పైగా మమ్మల్ని కొడతావు, గిచ్చుతావు. ఇదేం పద్ధతి.?’ అంటూ ఓ మహిళా జర్నలిస్టు, ఇంకో మహిళా జర్నలిస్టుపై మండిపడింది.

ఇద్దరిలో ఎవరూ తక్కువ కాదు.! ఒకర్ని మించి ఇంకొకరు రెచ్చిపోయారు. ఈ ఇద్దరి గొడవా చూసి, తెలుగు న్యూస్ ఛానళ్ళ జర్నలిస్టులు ముక్కున వేలేసుకుంటున్నారు. సీనియర్ పాత్రికేయులైతే, దారుణంగా వీళ్ళని తిట్టి పోస్తున్నారు.. ఇదేం జర్నలిజం అని.?

రాజకీయ నాయకులంటే నిస్సిగ్గుగా తిట్టుకుంటారు.. మీరేంటి.? రాజకీయ నాయకులకంటే దారుణంగా తయారయ్యారు.? అన్నది ఓ సీనియర్ జర్నలిస్టు ఆవేదన. రాజకీయ నాయకులతో నిత్యం సావాసం చేస్తున్నారు కదా.? మీడియాకెక్కడానికి.. ఇదిగో ఇలా కక్కుర్తి పడినట్టున్నారు.

సీనియర్ జర్నలిస్ట్ రెహానా, మరో సీనియర్ జర్నలిస్ట్ హసీనాల మధ్య గొడవ ఇది. ఇద్దరూ ‘నంబర్ వన్’ ర్యాంక్ కోసం పోటీ పడుతున్న న్యూస్ ఛానళ్ళు టీవీ9, ఎన్టీవీల్లో పని చేస్తున్నారు.

ఛానళ్ళ మధ్య నిస్సిగ్గు పోటీ నడుస్తోంది. జర్నలిస్టులూ ఇదిగో ఇలా బజార్న పడ్డారు. అన్నట్టు, రెండు ఛానళ్ళూ వైసీపీకి బాకా ఊదుతున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు కలిసి పని చెయ్యాలి కదా.? ప్చ్.. ఇక్కడైతే ఎవరి దారి వారిదే.!

ఎక్కడో పంపకాల్లో తేడా వచ్చి.. ఈ గొడవలంటూ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.