కుప్పంలో చంద్రబాబు ప్రభ అంతరించినట్లేనా..?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 సంవత్సరంలో టీడీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లు వింటే మాత్రం సొంత నియోజకవర్గంలో సైతం చంద్రబాబు ప్రభ అంతరించినట్లేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కుప్పం కార్యకర్తల మీటింగ్ లో చంద్రబాబు కుప్పంలో కార్యకర్తలు ఆశించిన స్థాయిలో పని చేయడం లేదని చెప్పుకొచ్చారు.

టీడీపీ కష్ట కాలంలో ఉన్న సమయంలో పని చేసే నాయకులు కావాలని చంద్రబాబు వెల్లడించారు. కుప్పంలో నాయకుల పనితీరును బేరీజు వేస్తానని పనితీరు ఆధారంగా వాళ్లకు ఎలాంటి స్థానం ఇవ్వాలో డిసైడ్ అవుతానని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే చంద్రబాబు ప్రవర్తన, ఆయన చేస్తున్న కామెంట్లు కార్యకర్తలకు కూడా చిరాకు తెప్పిస్తున్నాయని సమాచారం అందుతోంది.

అయితే చంద్రబాబు నాయుడు ఇదే సమయంలో పార్టీ సభ్యత్వ నమోదులో కుప్పం మొదటి స్థానంలో ఉందని అన్నారు. కార్యకర్తలు పని చేయడం లేదని బాబు చెబుతున్న నియోజకవర్గంలోనే పార్టీ సభ్యత్వ నమోదు మొదటి స్థానంలో ఉంటే ఏపీలో టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కుప్పంలో చంద్రబాబు నియోజకవర్గ సమీక్ష టెలీ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అయితే టెలీ కాన్ఫరెన్స్ కు సైతం టీడీపీ నేతలు డుమ్మా కొట్టారంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. 2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే మాత్రం టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఏపీలో టీడీపీ పరిస్థితి దయనీయ స్థితిలో ఉందని చంద్రబాబు చేసిన కామెంట్ల వల్ల ప్రూవ్ అవుతోంది.