మహాకూటమిలో టిడిపికి 8 స్థానాలు ఖరారు, పెండింగ్ లో మరో 7

తెలంగాణలో టిడిపి కోరుకునే స్థానాలు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. తెలుగు దేశం అధినేత చంద్రబాబుతో చర్చించిన తర్వాత తెలంగాణ నేతలు కాస్త తగ్గి అధినేత సూచన ప్రకారం 15 సీట్లలో పోటి చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా 25 సీట్లు అనుకున్నప్పటికి కూడా ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా 15 సీట్లకు ఒప్పుకున్నారాని కీలక నేతల ద్వారా తెలుస్తోంది.

తప్పకుండా గెలిచే స్థానాల్లో మాత్రమే పోటి చేయాలని టిటిడిపి నేతలు నిర్ణయించారు. 2014లో తమ పార్టీ నేతలు గెలిచిన అన్ని స్థానాలను తమకే కావాలని కోరారు. ఉప్పల్, ఎల్బీనగర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, కోరుట్ల, సత్తుపల్లి అసెంబ్లీ స్థానాలు దాదాపు టిడిపికి ఖరారైనట్టు తెలుస్తోంది. మహాకూటమిలో భాగంగా ఉన్న టిడిపి ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో ఈ విషయమై చర్చించారని దీనికి కాంగ్రెస్ కూడా ఒప్పుకున్నట్టు సమాచారం అందుతోంది.

పొత్తులో భాగంగా జగిత్యాల సీటును త్యాగం చేసిన టిటిడిపి నేత ఎల్ రమణ పోటి చేస్తానంటే కోరుట్ల అసెంబ్లీ స్థానాన్ని కేటాయించేందుకు కాంగ్రెస్ సిద్దంగా ఉందని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. వీటితో పాటు పార్టీ బలంగా ఉన్న మహబూబ్ నగర్, దేవరకద్ర, కోదాడ స్థానాలు కూడా ఇవ్వాలని టిడిపి నేతలు కాంగ్రెస్ ను కోరారు. భువనగిరిలో కూడా పార్టీ బలంగా ఉండటంతో భువనగిరి లేదా ఆలేరు టికెట్లివ్వాలని ప్రతిపాదనలు ఉంచినట్టు తెలుస్తోంది. సనత్ నగర్ ను కూడా కోరినప్పటికి అక్కడి నుంచి కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి బరిలో ఉండటంతో దానికి బదులు సికింద్రాబాద్ ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది.

ముషీరాబాద్, ఖైరతాబాద్ స్థానాలు దాదాపుగా తెలుగుదేశానికే ఖరారైనట్టు తెలుస్తోంది. మక్తల్ కుత్బుల్లాపూర్ లో కూడా తాము బలంగా ఉన్నామని వీటి విషయంలో కూడా ఆలోచించాలని రమణ కాంగ్రెస్ ను కోరారు. ఖమ్మం అసెంబ్లీ నుంచి నామా నాగేశ్వరరావు పోటికి సిద్దపడితే దానిని ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది.  

టిడిపికి దాదాపుగా ఖరారైన స్థానాలు

  1. ఉప్పల్- వీరెందర్ గౌడ్

  2. ఎల్బీనగర్

  3. కూకట్ పల్లి- పెద్దిరెడ్డి

  4. శేరిలింగంపల్లి- భవ్య ఆనందప్రసాద్ 

  5. రాజేంద్రనగర్

  6. మహేశ్వరం

  7. కోరుట్ల

  8. సత్తుపల్లి

టిడిపి కోరుతున్న మరికొన్ని స్థానాలివే

  1. మహబూబ్ నగర్

  2. దేవరకద్ర

  3. కోదాడ

  4. ముషీరాబాద్

  5. ఖైరతాబాద్

  6. ఖమ్మం

  7. సికింద్రాబాద్                                                                                                                                                                                                                                                                                                                                                                కుత్బుల్లాపూర్ అరవింద్ కుమార్ గౌడ్ లేదా కూన వెంకటేశ్ గౌడ్ కు కావాలని కోరుతున్నారు.                                        

నర్సంపేట స్థానాన్ని కూడా టిడిపి ఖచ్చితంగా కావాలని కోరుతుంది. దీని పై సంధిగ్దత నెలకొంది. ఎనిమిది స్థానాలు దాదాపుగా టిడిపికి ఖరారుకాగా మిగిలిన ఏడు స్థానాలు కూడా టిడిపికి ఇచ్చేందుకు మహాకూటమి సముచితంగా ఉందని తెలుస్తోంది. టిడిపి కోరుతున్న స్థానాల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు ఉండటం గమనార్హం. అందులో కోదాడ టిపిసిసి ప్రెసిడెంట్ స్థానం కావడం గమనించాల్సిన అంశం.