తెలంగాణ సర్పంచ్ ఎన్నికలల్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది. ఇప్పటకే పల్లెల్లో ఏడ చూసినా ఒకటే ముచ్చట. ఎవరు గెలుస్తరంటావు. ఎవరు గెలుస్తరంటావు అని. కలువ పోయిన కాడ అదే ముచ్చట.. గొర్ల మేపేకాడ కూడా అదే ముచ్చట. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సర్పంచ్ ఎవరు, వార్డు మెంబర్ ఎవరు. ఆయన గెలుస్తడా.. ఆమె గెలుస్తదా. అనే లొల్లి. 

తెలంగాణ గ్రామాలల్లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగియగానే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. పంచాయతీ ఎన్నికలు గ్రామాలకే పరిమితం కావడంతో స్థానికంగా చాలా ఆసక్తిగా ఉంటుంది. చాలా రాజకీయాలు నడుస్తాయి. పార్టీలకంటే వ్యక్తులుగానే ఎక్కువ రాజకీయాలు నడుస్తాయి. కుల, మత పరంగా కూడా ఈ ఎన్నికలు సాగే అవకాశం ఉంది. అందుకే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతా ఈ ఎన్నికల పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. 

ఇదంతా ఒక పక్కన ఉంటే ఇంతకీ ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో అని టెన్షన్. కొందరివి తీసేశారు. మరి కొందరిని కొత్తగా చేర్చారు. పూర్తి వివరాలు తెలియక చాలా మంది టెన్షన్ పడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ లింక్ పై క్లిక్ చేసి చూసుకోండి. 

http://elecroll.tsec.gov.in/gpWardWiseElecrolls.do