తెలంగాణలో ప్రారంభమైన తొలి విడత పంచాయతీ పోరు

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు అన్ని గ్రామాల్లో ఫలితాలు వెలువడుతాయి. తొలివిడతలో 4479 గ్రామాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. ఇందులో 9 గ్రామాలకు కేసుల వల్ల ఎన్నికలు జరగడం లేదు. 769 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3701 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 12,202 మంది అభ్యర్దులు సర్పంచ్ లుగా బరిలో ఉన్నారు.

వార్డు , సర్పంచ్ ఫలితాలు వచ్చిన వెంటనే చేయి ఎత్తే పద్దతిలో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. కోరం లేకపోతే మంగళవారం ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. తొలి విడత ఎన్నికల విధుల్లో 1,48,033 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 26 వేల మంది పోలీసు సిబ్బంది బందో బస్తు నిర్వహిస్తున్నారు.