తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ దసరా కానుక

తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ దసరా సందర్బంగా ఒక కానుక అందజేయాలని యోచిస్తోంది. తమకు పీఆర్సీ, మధ్యంతర భృతిని ఇవ్వాలని ఉద్యోగులు  ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో ఇప్పటికే సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో చర్చించారు. జూన్ 2న ఐఆర్, పంద్రాగస్టుకి పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం హామినిచ్చారు. కానీ పీఆర్సీ నివేదిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ మే చివరి వారంలో బాధ్యతలు స్వీకరించింది. దీంతో జూన్ 2 నాటికి మద్యంతర నివేదిక అందించేందుకు కమిటీకి సమయం దొరకలేదు. ప్రభుత్వం చేసేది లేక ఐఆర్ ప్రకటనను వాయిదా వేసింది. ఫిట్ మెంట్ 60% ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మొత్తానికి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుకగా పీఆర్సీ ఇవ్వబోతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం వారికి పీఆర్సీ, ఐఆర్ ఇవ్వాల్సిందేనన్న ధృడ నిశ్చయంతో సీఎం ఉన్నట్టుగా తెలుస్తొంది. ఇప్పటికే కొన్ని రంగాల్లో కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేశారు. మరికొంత మందిని కూడా రెగ్యులరైజ్ చేసే ఉద్దేశ్యంలో ప్రభుత్వం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్ కి సంబంధించి పలు అభ్యంతరాలు వస్తుండటంతో కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. వాటి సంగతి ఎలా ఉన్నా మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుకగా పీఆర్సీ ఇవ్వనుండటంతో వారిలో ఆనందం వెల్లివిరుస్తుంది.