బండ్ల గణేష్ గొంతు కోసుకుంటాడా ?

తెలంగాణ ఎన్నికల్లో ఊహించని విధంగా టీఆరెస్  విజయదుందుభి  మ్రోగిస్తుంది . ఈ ఎన్నికలు దేశ వ్యాప్తంగా  వేడి పుట్టించాయని చెప్పవచ్చు . ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు  అమిత్ షా , సోనియా  గాంధీ, కాంగ్రెస్  ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ , తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు చంద్ర  బాబు లాంటి హేమా హేమీలు ప్రచారం చేశారు . అయినా కాంగ్రెస్ నేతలు , తెలుగు దేశం వారు ఓటమి పాలయ్యారు . కేసీఆర్  ఒక్కడే పార్టీని విజయ పధంలో నడిపించారు .

బండ్ల గణేష్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో  కాంగ్రెస్ పార్టీలో చేరాడు. నిర్మాత  బండ్ల గణేష్ చేసిన సవాల్ ఇప్పుడు వైరల్ అవుతుంది. 

గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి విజయ సాధిస్తానని, అసెంబ్లీ లో అడుగు పెడతానని, ఎలా ప్రమాణం చేసేది కూడా చెప్పాడు . అయితే గణేష్ ఆశించినట్టు పార్టీ టికెట్ రాలేదు , అయినా పార్టీని వదిలి పెట్టనని  ,ప్రచార చేస్తానని చెప్పాడు , అలా చేసిన దాఖలాలు కూడాలేవు .

చానెల్స్ లో కూర్చొని మనసులో ఏది ఉంటే అది మాట్లాడటం మొదలు పెట్టాడు  అధికార ప్రతినిధి హోదాలో . 11వ  తేదీ న ఎన్నికల లెక్కింపు. ఆ రోజున ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని , ఒక వేళ రాకపోతే 7 ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని ఓ ఛానెల్లో శపథం చేశాడు . ఇప్పుడు టీఆరెస్  ఘన  విజయం సాధిస్తుందని తెలిసిపోయింది .

సోషల్ మీడియాలో బ్లేడ్ తో గొంతు కోసుకొమ్మని నెటిజనులు  సలహాలిస్తున్నారు . నోరుంది కదాని ఏదిపడితే అది మాట్లాడితే ఫలితం ఇలాగే ఉంటుందేమో . దీనిపై గణేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి ?