ప్రేమించలేదని 9వ తరగతి విద్యార్ధిని గొంతు కోసిన సారు

కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విద్యా బుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు ప్రేమించాలంటూ విద్యార్దిని వెంట పడ్డాడు. విద్యార్ధిని తిరస్కరించడంతో ఆమె గొంతు కోశాడు. అసలు వివరాలేంటంటే…

కర్నూలు జిల్లా బంగారుపేటలోని ప్రభుత్వ పాఠశాలలో శంకర్ అనే ఉపాధ్యాయుడు హిందీ టిచర్ గా పనిచేస్తున్నారు. అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్దినిని శంకర్ ప్రేమించమని వెంటపడుతున్నాడు. దానిని ఆ బాలిక వ్యతిరేకించడంతో శనివారం ఉదయం ఆమె ఇంటికి వెళ్లిన శంకర్ కత్తితో ఆమె మెడపై కోశాడు. అనంతరం శంకర్ కూడా గొంతు కోసుకున్నాడు.

బాలిక అరుపులు విన్న స్థానికులు శంకర్ ను పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి కొట్టారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఘాతుకానికి పాల్పడ్డ శంకర్ ను సస్పెండ్ చేయాలని డిఈవోకి ఆదేశాలిచ్చారు. గాయపడ్డ విద్యార్ధినికి మెరుగైన వైద్య సేవలందించాలన్నారు.