Graduate MLC Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. టీడీపీకి బలమైన సంకేతమా?

ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మరోసారి సత్తా చాటింది. 2023లో మూడు స్థానాలు కైవసం చేసుకున్న సైకిల్ పార్టీ, తాజాగా 2025 ఎన్నికల్లో మరో రెండు స్థానాల్లో విజయం సాధించింది. దీంతో రాష్ట్రంలోని ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ క్లీన్ స్వీప్ చేసినట్లైంది. ఫిబ్రవరి 27న జరిగిన ఉమ్మడి గోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీలతో గెలుపొందారు.

ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ 82,320 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఏడో రౌండ్‌కల్లా అతను విజయానికి అవసరమైన ఓట్లను సాధించగా, ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 71,063 ఓట్ల తేడాతో గెలిచారు. రెండు స్థానాల్లోనూ టీడీపీ బలమైన ఆధిక్యాన్ని ప్రదర్శించడం విశేషం.

గత ఏడాది ఉత్తరాంధ్ర నుంచి వేపాడ చిరంజీవి, తూర్పు రాయలసీమ నుంచి కంచర్ల శ్రీకాంత్, పశ్చిమ రాయలసీమ నుంచి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా గెలిచిన నేపథ్యంలో, ఇప్పుడు మరో రెండు స్థానాల్లో విజయంతో టీడీపీ పట్టాభద్రుల లోక్‌సభ వర్గాల్లో గట్టి పట్టును నిలుపుకుంది. ముఖ్యంగా పశ్చిమ రాయలసీమ ఎన్నికల్లో జగన్ కంచుకోట పులివెందులలోనూ టీడీపీ అభ్యర్థికి గణనీయంగా ఓట్లు రావడం విశేషంగా మారింది.

ఈ ఎన్నికల ఫలితాలను రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. సాధారణంగా పట్టభద్రుల ఓటింగ్‌ షరతులు కఠినంగా ఉండటంతో, ఇది ఒక విధంగా ప్రభుత్వానికి మద్దతుగా మారే అవకాశముండదు. కానీ టీడీపీ వరుసగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడం ఎన్డీయే కూటమికి పెరిగిన బలాన్ని సూచిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా 2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే, ఎన్డీయే కూటమికి ఈసారి 10% అదనపు ఓట్లు వచ్చాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాలను ఆసక్తిగా గమనించిన వైసీపీ వర్గాలు, తమ వ్యూహాన్ని ఎలా మార్చుకోవాలన్న దానిపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

పిచ్చి కూతలు కూయకు || Varudu Kalyani Vs Vangalapudi Anitha || Varudu Kalyani Satires On Budjet || TR