అనురాధకు ఒమెన్స్ డే గిఫ్ట్ ఇస్తున్న బాబు!

ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో కూడా ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు వార్ వన్ సైడ్ గా ఉంటుందనేది తెలిసిన విషయమే. ఎందుకంటే… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంఖ్యాబలం అంత ఉంది మరి! దీంతో మొత్తం అన్ని స్థానాలు అధికారపార్టీకి దక్కే అవకాశం ఉంది. అయితే… ఈనెల 13 లోగా ఈ ఎన్నికలకు నామినేషన్లు వేయాల్సి ఉండగా.. ఇప్పటికే ఎంపిక చేసిన అభ్యర్థులకు జగన్ బిఫారాలు కూడా ఇచ్చేశారు. తాజాగా వాళ్లందరితో గ్రూప్ ఫోట్ కూడా దిగారు!

అయితే నిన్నటిదాకా ఈ పోటీలో తెలుగుదేశం పార్టీ ఉంటుందనే మాట కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కడా వినిపించలేదు. ఎందుకంటే… ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయం సాధించాలంటే.. 22-23 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం పడతాయి. అయితే… టీడీపీ కి గత ఎన్నికల ఫలితాల ప్రకారం 23 మంది బలం ఉన్న మాట వాస్తవమే కానీ.. ఆ 23 మందిలో నలుగురు పార్టీకి దూరంగా ఉంటున్న పరిస్థితి. పోని కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ అభ్యర్థికే ఓటువేస్తారు అని భావించినా.. ఇంకా రెండు ఓట్లు అవసరం పడతాయి. అంటే… ఎలా చూసుకున్నా గెలిచే అవకాశం లేదన్నమాట!

అలా గెలిచే అవకాశం ఏమాత్రం లేని ఎమ్మెల్సీ స్థానానికి తమ పార్టీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధను బరిలోకి దించుతున్నారు చంద్రబాబు. గతంలో కూడా రాజ్యసభ ఎన్నికల విషయంలో తమకు బలం లేదని తెలిసినా, పక్కాగా ఓడిపోయే సీటు అనే సృహ ఉన్నా కూడా వర్ల రామయ్యను బరిలోకి దింపి బలిపశువును చేసిన సంగతి తెలిసిందే! ఇదే క్రమంలో… ఆ అవకాశం ఇప్పుడు పంచుమతి అనురాధకు ఇస్తున్నారు బాబు! దీంతో… బాబు ఇంకా మారలేదు – కాదు కాదు మారరు అని కామెంట్లు పెడుతున్నారు తమ్ముళ్లు!

కాగా… బలం లేని ప్రతిసారీ ఎవరో ఒక బలహీనులను ఇలా బలిపశువులను చేయడం బాబుకు మామూలే అని… పార్టీకి పుష్కలంగా బలం ఉన్నప్పుడు మాత్రం.. అయిన వారికి టికెట్లు ఇచ్చుకుంటూ, మరికొన్ని టికెట్లు అమ్ముకుంటూ చేయడం ఆయన ప్రత్యేకత అని విమర్శలు చేస్తున్నారు నేటిజన్లు. దీంతో… ఖచ్చితంగా ఓడిపోయే సందర్భంలో “మహిళకు టికెట్ ఇస్తున్నా”… గెలిచే ప్రసక్తి లేని సందర్భంలో… వర్ల రామయ్య వంటివారికి సీటిచ్చి… “దళితులకు ఇస్తున్నా” అని బిల్డప్ కోసం ఇలా చేస్తున్నారనే విమర్శలు పార్టీలోనే వినిపిస్తుండటం కొసమెరుపు!