బ్రేకింగ్ న్యూస్.. టిడిపి, టిజెఎస్, సిపిఐ పోటి చేయబోయే స్థానాలివే

తెలంగాణలో ఏర్పడిన మహాకూటమిలో సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, టిజెఎస్ లు కలిసి మహాకూటమిగా జతకట్టాయి. 95 స్థానాల్లో పోటి చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. 119 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 95 స్థానాల్లో పోటి చేస్తుండటంతో 24 స్థానాల్లో మిగిలిన పార్టీలు `పోటి చేయాల్పి ఉంది.

సీట్ల పంపకాలపై చాలా కసరత్తే జరిగినట్టు తెలుస్తోంది. సిపిఐ తమకు 6 స్థానాలు ఇవ్వాలని పట్టుబడుతోంది. టిడిపి 18, టిజెఎస్ 15 స్థానాలు కావాలని పట్టుబట్టడంతో కూటమి చర్చలు ఇంతకాలం సాగాయి. శనివారం హైదరాబాద్ శివార్లలో సమావేశమైన కూటమి నేతలంతా సీట్ల పంపకాలపై చర్చించారు. ఎవరెవరికి ఏఏ స్థానాలో కూడా తేల్చేసినట్టు తెలుస్తోంది. టిడిపికి 14, టిజెఎస్ కు 6, సిపిఐకి 4 స్థానాలు ఇవ్వాలని నిర్ణయించారు. అయిష్టంగానే మిగిలిన పార్టీలు దీనికి ఒప్పుకున్నాయని నవంబర్ 8 న 119 స్థానాలకు ఒకే సారి అభ్యర్దులను ప్రకటించాలని నేతలు నిర్ణయించారు.

కూటమిలో మిగిలిన పార్టీలు పోటి చేయబోయే స్థానాలివే…

టిడిపి కి కేటాయించిన సీట్లు 

1) ఖమ్మం
2) సత్తుపల్లి
3) అశ్వరావుపేట
4) మక్తల్
5) దేవరకద్ర
6) కోదాడ/సికింద్రాబాద్
7) నిజామాబాద్ రూరల్
8) కూకట్ పల్లి
9) శేరిలింగంపల్లి
10) ఉప్పల్
11) పటాన్ చెరువు
12) రాజేంద్రనగర్
13) మలక్ పేట్
14) చార్మినార్

టిజెఎస్ కు

1. సిద్దిపేట
2. రామగుండం
3. ముషిరాబాద్ లేదా అంబర్ పేట
4. చెన్నూరు
5. ఓల్డ్ సిటి1
6. ఓల్డ్ సిటి2

ఇక బెల్లంపల్లి, దేవరకొండ, కొత్తగూడెం, మునుగోడు లేదా హుస్నాబాద్ నియోజకవర్గాల టికెట్లను సీపీఐకి కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వనుంది.  మిగిలిన 95 స్థానాల్లో కాంగ్రెస్ పోెటి చేయనుంది. నాయకులకు  ఇష్టం లేకున్నా టిఆర్ఎస్  ఓటమే ద్వేయంగా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అసంతృప్తులను బుజ్జగించాల్సిన బాధ్యతలను పార్టీల అధినేతలే తీసుకోవాలని నిర్ణయించారు.