టీడీపీ సర్వే: జనసేనకి 24 సీట్లు.!

తెలుగుదేశం పార్టీ ఓ సర్వే చేయించుకుందిట. ఆ సర్వేలో టీడీపీకి 124 సీట్లు వస్తాయట.! జనసేన పార్టీ 24 సీట్లలో గెలిచే అవకాశం వుంటుందట. ‘కలిసి పోటీ చేస్తే ఇదే ఈక్వేషన్.. మేం గనుకు సోలోగా పోటీ చేస్తే, మా మెజార్టీ ఇంకో పది సీట్ల వరకు పెరుగుతుంది..’ అన్నది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

అసలు ఈ సర్వే ఎప్పుడు చేశారు.? ఎలా చేశారు.? ఏమోగానీ, టీడీపీ శ్రేణుల్లో అయితే ఈ సర్వే గురించి లోతైన చర్చ జరుగుతోంది. చర్చ జరగడమేంటి.? ఈ సర్వేకి అనుగుణంగానే, జనసేన పార్టీకి 25 నుంచి 30 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వకూడదు పొత్తులో భాగంగా.. అనే నిర్ణయానికి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చేశారట కూడా.!

బీజేపీతో కలిసి పోటీ చేయడానికి టీడీపీ సుముఖత వ్యక్తం చేయడంలేదట. అదే సమయంలో బీజేపీ కూడా, టీడీపీతో కలవడానికి ఇష్టపడటంలేదు. అయితే, రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడెలా మారిపోతాయో చెప్పలేం.

రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్ని కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. రాష్ట్రంలో విపక్షం బలహీనంగా వుందని కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ తెలుసుకోలేదని ఎలా అనుకోగలం.? బీజేపీ అధినాయకత్వం దగ్గర అన్ని లెక్కలూ పక్కాగా వుంటాయ్.

జనసేన – బీజేపీ కూటమి మాత్రమే ప్రస్తుతానికి అధికారికం. టీడీపీ – బీజేపీ – జనసేన కలవాలని జనసేన అధినేత కోరుకుంటున్నారు. దానికి పరిస్థితులు ప్రస్తుతానికి అంత అనుకూలంగా లేవు. జనసేనాని ఆలోచనలు ఇలా వుంటే, జనసేన స్థాయిని తగ్గించేసి, జీరో చేసెయ్యడానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది.

ఈ ప్రయత్నాల్లోనూ జనసేనకు 24 సీట్లు వస్తాయని టీడీపీ అంచనా వేయడమేంటి.? అది జనసేన మీద ప్రేమతో కాదు, వైసీపీ మీద వ్యతిరేకతతో.! అదీ అసలు సంగతి.