తెలంగాణలో ఎన్నికల వేళ టికెట్లు లభించక నేతలు తీవ్ర ప్రస్టేషన్ లో ఉంటున్నారు. మహా కూటమి ఏర్పడటంతో వివిధ పార్టీల నేతలు వారు ఆశించిన సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఎల్ బీ నగర్ టిడిపి అసెంబ్లీ సీటును ఆశించిన సామ రంగారెడ్డికి ఇబ్రహీం పట్నం సీటును కేటాయించారు. తన క్యాడర్ అంతా ఎల్ బీ నగర్ లో ఉంటే ఇబ్రహీంపట్నం పోయి ఏం చేయాలని ఆయన పోటి నుంచి తప్పుకుంటానన్నారు.
గురువారం తన అనుచరులతో వెళ్లి అమరావతిలో చంద్రబాబును కలిశారు. సర్దుకు పోవాలని ఇబ్రహీంపట్నంలో పార్టీ సపోర్ట్ చేస్తుందని చెప్పి పంపారు. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను నామా నాగేశ్వరరావుకు అప్పగించారు.
సీటు కేటాయింపు పై సామ రంగారెడ్డికి ఓ కార్యకర్త ఫోన్ చేసి అన్నా… నీకు అక్కడ కేటాయించిర్రు ఏందన్నా.. మీరు ఎల్ బీ నగర్ నుంచి పోటి చేయాలని కోరారు. అంతే.. రంగారెడ్డి కార్యకర్త పై సుర్రున లేచి, పార్టీ నాయకత్వాన్ని తిడుతూ ఏం మాట్లాడారో వినండి.