టీడీపీతో జర జాగ్రత్త రామ్ చరణ్.!

మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రామ్ చరణ్, తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్నాడా.? ‘ఇకపై తెలుగుదేశం పార్టీ నిన్ను మావాడిగా గుర్తిస్తోంది. నందమూరి బాలకృష్ణ అభిమానుల మద్దతు నీ సినిమాలకు ఖచ్చితంగా వుంటుంది.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మీ సినిమాలకు సంపూర్ణ మద్దతునిస్తాయి..’ అంటూ టీడీపీ శ్రేణులు చేస్తున్న ప్రచారం పట్ల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకింత అప్రమత్తంగా వుండాల్సిందే.!

చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మాత్రమే కాదు.. మెగా కాంపౌండ్ నుంచి ఏ హీరో సినిమా వచ్చినా, దానిపై దుష్ప్రచారం చేసేది నందమూరి అభిమానులే, టీడీపీ కార్యకర్తలే. ఇది బహిరంగ రహస్యం.

మెగా కాంపౌండ్ మీద ద్వేషంతో ఆ కాంపౌండ్‌లోని అల్లు అర్జున్‌కి సహకరిస్తున్నట్లు నటిస్తూ, చిరంజీవి – అల్లు అర్జున్ మధ్య విభేదాలున్నట్లు సృష్టించారు. మెగాభిమానులకీ అల్లు అర్జున్ అభిమానులకీ మధ్య ఫిటింగు పెట్టారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కలిసి నటించిన రామ్ చరణ్ – ఎన్టీయార్ మధ్య విభేదాలు సృష్టించడానికీ, ఆ ఎన్టీయార్ అభిమానుల్ని రెచ్చగొట్టి రామ్ చరణ్ సహా మెగా కాంపౌండ్ మీదకు ఉసిగొల్పుతున్నారు తెలుగు తమ్ముళ్ళు, నందమూరి అభిమానులు.

బాబాయ్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ వైపు రామ్ చరణ్ నిలబడతాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ – జనసేన పొత్తులు పెట్టుకుంటాయా.? లేదా.? అన్నది వేరే చర్చ. కానీ, టీడీపీ రాజకీయం పట్ల రామ్ చరణ్ ఒకింత అప్రమత్తంగా వుంటే మంచిది.