బడ్జెట్ సమావేశాలపై టిడిపి వ్యూహాత్మకం

గురువారం నుండి జరగనున్న ఏపి బడ్జెట్ సమవేశాలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం కనబడటం లేదు.  అధికార పార్టీని రెచ్చగొట్టేందుకు చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా బేస్ ప్రిపేర్ చేస్తున్నట్లే ఉంది. వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి టిడిపి నేతలపై దాడులు జరుగుతోందంటూ చంద్రబాబు చేస్తున్న రచ్చంతా ఇందులో భాగమే అని అనుమానంగా ఉంది.

వైసిపి అధికారంలోకి వచ్చిన నెలరన్నరలో కొన్ని జిల్లాల్లో గొడవలైన మాట వాస్తవం. జరిగిన గొడవల్లో ఎక్కువగా వైసిపి-టిడిపి స్ధానిక నేతల మధ్య వ్యక్తిగత గొడవలే ప్రధాన కారణం. అయితే చంద్రబాబు అండ్ కో మాత్రం టిడిపి నేతలపై వైసిపి నేతలు కావాలనే దాడులు చేస్తున్నారంటూ నానా యాగీ చేస్తున్నారు. టిడిపి నేతలే టార్గెట్ గా చేసిన దాడుల్లో ఇప్పటికి 6 మంది చనిపోయారంటూ చంద్రబాబు ఫుల్లుగా ఫైర్ అయిపోతున్నారు.

ఆ పాయింట్ మీదే చంద్రబాబు ఇప్పటి వరకూ చిత్తరు,  ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పర్యటించారు. మొత్తం మీద జనాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అందరికీ అర్ధమైపోతోంది. ఈ నేపధ్యంలోనే బడ్జెట్ సమావేశాలు 11వ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి.

బడ్జెట్ సమావేశాల్లో టిడిపి పై దాడుల అంశాన్ని  చంద్రబాబు లేవనెత్తాలని ఎంఎల్ఏలకు సూచించారు. అంటే ఏదోరకంగా అసెంబ్లీలో గందరగోళం సృష్టించి జనాల అటెన్షన్ ను తమవైపు తిప్పుకోవాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనబడుతోంది. జనాల సింపథి కోసమే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారు. ఎప్పుడో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుండే జనాల సింపథీ కావాలంటే సాధ్యమవుతుందా అన్నదే ప్రశ్న.