చితక్కొట్టారు.. మారలేదు.. తగ్గేదేలే!

గన్నవరంలో జరిగిన ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం… తాజాగా బెయిల్ ఇచ్చింది!

అవును… టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రాం ‎కు కోర్టులో ఊరట లభించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పట్టాభి విడుదలయ్యారు. పట్టాభికి జిల్లా కోర్టుబెయిల్ మంజూర్ చేసింది. రూ.25వేల చొప్పున పూచీకత్తు ఇవ్వాలనీ కోర్టు ఆదేశించింది. దీంతో… జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు పట్టాభి!

తాను ఒక బీసీ నేతకు ఇబ్బంది కలుగుతుంటే పరామర్శకని వెళ్లాలని.. బీసీలపై దాడులు జరుగుతుంటే ఎవరూ అడ్డుకోవద్దా అని.. అలా అడ్డుకుని – సానుభూతి తెలపడానికి వెళ్లిన తనపై కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు. బీసీలపై దాడి చేస్తే టీడీపీ ఊరుకోదని అన్నారు. దీంతో… నెట్టింట ఎదురుప్రశ్నలు – కామెంట్లు పడుతున్నాయి పట్టాభి కి!

గన్నవరం వెళ్లేముందు ప్రెస్ మీట్ లో పట్టాభి మాట్లాడిన మాటలు ఎలాంటివి.. గన్నవరం వెళ్లి పోలీసులపై చేసిన దాడులు ఏమిటి.. తీరా లోపలేసాక బయటకువచ్చి.. బీసీలకోసం పోరాడుతుంటే తనను జైల్లో పెట్టారనే కబుర్లు చెప్పడం ఏమిటి? అన్నది ఆ ప్రశ్నల సారాంశం!

ఈ సందర్భంగా మరింత మాట్లాడిన పట్టాభి… తనను జైల్లో చితక్కొట్టారని, ముఖంపై ముసుగేసి కొట్టారని, సుమారు మూడు గంటలపాటు గ్యాప్ ఇవ్వకుండానే దాడి చేశారని చెప్పుకొచ్చారు. కాగా… పట్టాభిపై ఎలాంటి దాడి జరగలేదని మెడికల్ రిపోర్ట్స్ అనంతరం కోర్టు తెలిపిన సంగతి తెలిసిందే!

దీంతో… పట్టాభిచెబుతున్నట్లు చితక్కొట్టడం కాసేపు నిజం అనుకుంటే… “చితక్కొట్టారు” – బయటకొచ్చి మళ్లీ అవే కబుర్లు చెబుతున్నాడు అంటే… “మారలేదు” – మళ్లీ తన పోరాటం కొనసాగుతుందని చెబుతున్నాడు (అంటే తన మార్కు బూతు పురాణ పోరాటమైతే) “తగ్గేదేలే” అన్నమాట అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!

YouTube video player