టీడీపీకి నిజంగానే దరిద్రం పట్టుకుంది.. ఆయన కూడ వెళ్ళిపోతారట ?

TDP MP deeply upset with CBN

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంగతి అందరికీ తెలిసిందే.  ఎన్నికలు ముగిసి జగన్ సీఎం అయ్యాక టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు మొదలవుతున్నాయి అనే సమయానికి రఘురామకృష్ణరాజు ఒక్కసారిగా రివర్స్ అయ్యారు.  సొంత పార్టీ  మీదే విమర్శలు, ఆరోపణలు స్టార్ట్ చేశారు.  ఒకానొక దశ-లో ఆయన జగన్ మీద కూడ అసహనం వ్యక్తం చేశారు.  అసలు వైసీపీలోని  నాయకులు నాయకులే కాదన్నట్టు, వారు చేసేది ప్రాకారంజక పాలన అవదన్నట్టు మాట్లాడుతున్నారు.  ఆయన మూలాన పశ్చిమ గోదావరిలో పార్టీ ప్రతిష్ట కొంతమేర డ్యామేజ్ అయిందనేది వాస్తవం.  ఎంత కాదన్నా ఒక ఎంపీ అలా రివర్స్ గేర్ వేయడంతో ప్రజలు ఆలోచనలో పడ్డారు.  ఇప్పుడు ఇలాంటి రెబల్ ఎంపీనే ఒకరు తయారవుతున్నారు.  అయితే ఈసారి టీడీపీలో కావడం కొత్త విషయం. 

గత ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచిందే మూడు ఎంపీ స్థానాలు.  వాటిలో ఒకటి విజయవాడ లోక్ సభ స్థానం.  సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నాని మరోసారి  గెలుపొందారు.  గెలిచారనే కానీ ఆయనలో సంతృప్తి లేదు.  ఎందుకో మొదటి నుండి పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద అసంతృప్తిగానే ఉన్నారు.  పార్టీలో ఇమడలేకపోతున్నారు.  నిజానికి రఘురామరాజు కంటే ముందే అసమ్మతి స్వరం వినిపించారు నాని.  నేరుగా పార్టీ నేతల మీద విమర్శలు గుప్పించారు.  తన వ్యతిరేక వర్గాన్ని కొందరు పార్టీ పెద్దలు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.  కానీ చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో ఆ గొడవ అంతటితో సద్దుమణిగింది.  నాని మళ్ళీ యాక్టివ్ అయ్యారు.  కొన్నాళ్ళు పార్టీ కార్యకలాపాల్లో, పాలక వర్గం మీద పోరాడటంలో చురుగ్గా ఉన్నారు.  మళ్ళీ ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు. 

TDP MP deeply upset with CBN
TDP MP deeply upset with CBN

ఈసారి ఆయన కోపం ఏకంగా చంద్రబాబు మీదేనని  అంటున్నారు.  చంద్రబాబు సైతం జిల్లాలో తనకు గిట్టని వర్గానికి పెద్ద పీఠ వేయడం, పార్టీ పదవులు కట్టబెట్టడం చేశారనేది ఆయన కోపమట.  అందుకే పార్టీ మారే యోచన   చేస్తున్నారని విజయవాడ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.  కేశినేని నాని వెళ్ళిపోతే టీడీపీకి విజయవాడలో ఆనవాళ్లు కూడ ఉండవనేది వాస్తవం.  గత ఎన్నికలే చూసుకుంటే విజయవాడ లోక్ సభ పరిధిలోని ఏడు  స్థానాల్లో టీడీపీ గెలిచింది ఒక్క తూర్పు నియోజకవర్గంలో మాత్రమే.  మిగిలిన అన్ని చోట్లా వైసీపీ జెండానే ఎగిరింది.  అంత వ్యతిరేకతలో కూడ నాని ఎంపీగా గెలిచారంటే ఆయన సొంత బలం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.  అలాంటి మంచి కేడర్ ఉన్న నాని పక్కకు తప్పుకుంటే పార్టీ ప్రమాదంలో పడ్డట్టే. 

ప్రస్తుతం నాని మనసులో ఒకే ఒక కోరిక ఉందట.  అదే తన కుమార్తెను విజయవాడ మేయర్ పదవిలో చూడాలని.  గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీయే గెలిచింది.  అందులో నాని హస్తం ప్రముఖం.  ఈసారి మేయర్ సీటు తన కుమార్తెకు ఇవ్వాలనేది నాని డిమాండ్.  చంద్రబాబు గనుక దీనికి ఒప్పుకుంటే దగ్గరుండి అన్నీ చూసుకుంటారు.  లేకపోతే తన దారేదో తాను చూసుకుంటానని సంకేతాలిస్తున్నారట.  అసలే ఆయన కోసం బీజేపీ కాచుకుని ఉంది.  నాని టీడీపీ నుండి బయటకు రావడం బీజేపీ చుట్టుముట్టేస్తుంది.  మరి చంద్రబాబు కేశినేని నాని కోరికను మన్నించి విజయవాడలో పార్టీని కాపాడుకుంటారో లేదో చూడాలి.