సాక్షి పత్రికపై కోట్లలో పరువు నష్టం దావా: టిడిపి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ భార్య వైఎస్ భారతి చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న సాక్షి పత్రికకు టీడీపీ ఎమ్మెల్యే ఝలక్ ఇచ్చారు. ఆధారాలు లేకుండా తనపై అసత్య కధనాలు ప్రచురించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సాక్షి దినపత్రిక యాజమాన్యంపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ఆయన బుధవారం మీడియా ఎదుట వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ చదవండి.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డిపై సాక్షి దినపత్రిక కర్నూల్ జిల్లా సెంటర్ పేజ్ లో అవినీతి ఆరోపణలు చేస్తూ వసూళ్లకు జయహో అనే కధనాన్ని ప్రచురించింది. అందులో వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి మాట్లాడారు.

 

ఈ సందర్భంగా సాక్షి దినపత్రికలో తనపై వచ్చిన కధనాలు అవాస్తవమని ఆయన తేల్చి చెప్పారు. సాక్షిలో ప్రచురించిన ప్రతి ఆరోపణ అవాస్తవమని నిరూపిస్తూ అందుకు సంబంధించిన ఆధారాలను ఒక్కొక్కటిగా మీడియా ఎదుట ప్రవేశపెట్టారు జయ నాగేశ్వర రెడ్డి.

పత్రికా విలువలు మరిచి స్వార్ధ ప్రయోజనాల కోసం తనపై తప్పుడు కధనాలు ప్రచురించినందుకు గాను సాక్షి పత్రికపై 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఆయన మీడియా ఎదుట తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వైసీపీకి పట్టుకుందని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

టీడీపీ హయాంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు జనం హర్షం వ్యక్తం చేయడాన్ని ఓర్వలేక మీడియాను అడ్డం పెట్టుకుని ఇలాంటి కుట్రలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసారు బీవీ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేస్తోన్న శ్వేతపత్రాలు జగన్ మీడియా అవహేళన చేస్తోందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని, మళ్ళీ తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు మ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.