తిరుమల శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణం జరుగుతోంది. మహాసంప్రోక్షణలో పాల్గొనటానికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేకి అవమానం జరిగింది. మహాసంప్రోక్షణలో భాగంగా నిర్వహిస్తున్న మహాశాంతి తిరుమంజనం కార్యక్రమానికి ఎమ్మెల్యే సుగుణమ్మను అనుమతించలేదు టీటీడీ అధికారులు. టీటీడీ పాలకమండలి సభ్యులకు అనుమతి ఇచ్చిన టీటీడీ అధికారులు తనకి అనుమతి ఇవ్వకపోవడంపై ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఒక స్థానిక ఎమ్మెల్యే ఐన తనకు అనుమతి ఉందా లేదా అనే విషయాన్నీ అధికారులు స్పష్టం చేయాలంటూ ఆవిడ డిమాండ్ చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు వెళ్తే ఆలయం ముందు ఉన్న బయోమెట్రిక్ ఎంట్రన్స్ దగ్గర సంప్రదించామన్నారు. సన్నిధిలోని ల్యాండ్ లైన్ కి కాల్ చేస్తే ఈరోజు అనుమతి లేదని, రేపు రమ్మని అధికారులు చెప్పినట్టు ఆమె వెల్లడించింది.
ఆలయంలో మహాశాంతి తిరుమంజనానికి ఉన్న గొప్ప భక్తులెవరో తనకు చూపించాలంటూ డిమాండ్ చేసింది. ఈ సంఘటనలో టీటీడీ పాలక మండలి సభ్యులు టీటీడీ చైర్మన్, ఈఓ, ఇతర మహా భక్తులకు ఆహ్వానం ఎలా లభించిందో తనకు వివరణ ఇవ్వాలని ఆమె కోరింది. తనకు జరిగిన ఈ అవమానాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్తానంటూ హెచ్చరించింది సుగుణమ్మ.