రాజమండ్రిలో ప్రస్తుతం టీడీపీ మహానాడు అట్టహాసంగా జరుగుతుంది. ఎటు చూసినా పసుపు జెండాలు దర్శనమిస్తున్నాయి. కనిపించిన ప్రతీ కరెంట్ పోల్ కూ పసుపు జెండాలు కట్టేలా స్థానిక టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి ప్లాన్ చేశారు. అలంకరణలు, భోజనాలు కూడా అదరగొడుతున్నాయి. అయితే ఈ సమయంలో మహానాడులో కాసేపు మాత్రమే ఉండి బయటకుపోతున్న తమ్ముళ్ల తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు జరుగుతున్న మహానాడు ఎంత ముఖ్యమైనదో టీడీపీ నేతలకు తెలియంది కాదు. అయినా కూడా ఆత్మస్తుతి పరనింధలకే ప్రాధాన్యం ఇస్తూ రొట్ట కొట్టుడు కొడుతున్నారు వక్తలు. కేడర్ కు దిశానిర్ధేశం చేసే ప్రసంగం ఒక్కటి కూడా లేదు. సీట్లు రాకపోయినా కాంగారు పడకండి… 2029లో వస్తాయని లోకేష్ అంటుంటే.. 160 సీట్లొస్తాయని అచ్చెన్న చెప్పుకొచ్చారు. జగన్ పని అయిపోయిందని బాబు పలికారు.
దీంతో ఇవి రోజూ వినే విమర్శలే కదా అనుకున్నారో ఏమో కానీ… ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన తమ్ముళ్లు కార్లు బయటకు తీసి విహారయాత్రకు పోతున్నారంట. నాయకులకు అంత ధైర్యం ఉన్నప్పుడు ఇక తమతో పనేముందని భావించారో ఏమో… బయటకు వెళ్లిపోయారు తమ్ముళ్లు!ప్రస్తుతం రాజమండ్రిలో ఇది హాట్ టాపిక్ గా మారింది.
కారణం… శనివారం జరిగిన టీడీపీ మహానాడు తొలిరోజు భోజనాల తర్వాత చూస్తే… మహానాడు ప్రాంగణం వద్ద కంటే ఎక్కువగా తమ్ముళ్లు మరోచోట దర్శనమిచ్చారు! అవును.. మహానాడు ప్రాంగణానికి దగ్గరలోనే ఉన్న దవళేశ్వరం వద్ద గల కాటన్ బ్యారేజీ ని చూడటానికి, ఆ బ్యారేజీ పక్కనే ఉన్న కాటన్ మ్యూజియం ని దర్శించడానికే టీడీపీ కార్యకర్తలు ఉత్సాహం చూపించారని తెలుస్తుంది. స్థానికంగా టీడీపీ అనుకూల మీడియాలో సైతం ఈ వార్తలు రావడం గమనార్హం.
శనివారం మధ్యాహ్నం మహానాడులో భోజనాలు ముగిసిన అనంతరం ఎండ వేడి తట్టుకోలేకపోయారో.. లేక, ఊకదంపుడు ఉపన్యాశాలు భరించలేకపోయారో తెలియదు కానీ… కాటన్ బ్యారేజీ, కాటన్ మ్యూజియం ల వద్ద పసుపు సైన్యం భారీగా కనిపించింది. ప్రస్తుతం టీడీపీలో ఇది హాట్ టాపిక్ గా మారింది!