తెలుగుదేశం పార్టీలో నందమూరి బాలకృష్ణ సీన్ ఎంత.? ‘టీడీపీ స్థాపించిందే మా నాన్నగారు.. అది మా పార్టీ..’ అని బాలకృష్ణ గట్టిగా చెప్పలేని పరిస్థితి. బావ చంద్రబాబు భజనకే పరిమితమవుతున్నారు బాలకృష్ణ. తన అల్లుడు నారా లోకేష్‌కే పగ్గాలు రావాలని చూస్తారుగానీ, తానెందుకు ఆ పగ్గాల కోసం పోటీ పడతారు.?
నందమూరి అభిమానులు మాత్రం, ‘స్వర్గీయ ఎన్టీయార్ పార్టీలో.. బాలయ్యే కింగ్’ అని భజన చేసుకుంటుంటారు. ఈ క్రమంలో ఆ నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీయార్‌ని రాజకీయంగా వెలి వేసేందుకూ ప్రయత్నిస్తుంటారు.
ఇక, టీడీపీ మహానాడుకి సంబంధించి టీడీపీ అనుకూల మీడియాలో ప్రకటనలు ఇచ్చుకున్నా, అందులో ఎక్కడా నందమూరి బాలకృష్ణ ఫొటో కనిపించలేదు. అంత పెద్ద ప్రకటనలు.. పైగా, ఫుల్ పేజీ ప్రకటనలు. వాటిల్లో బాలయ్య కోసం స్పేస్ లేకపోవడమేంటో.!
కేవలం చంద్రబాబు, లోకేష్.. తప్పదు గనుక స్వర్గీయ ఎన్టీయార్ ఫొటోలు మాత్రమే పెట్టారు. టీడీపీకి చెందిన పలువురు నేతల ఫొటోలు వున్నా, బాలయ్య ఫొటో మాత్రమే పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. దీనర్థమేంటి.? మహానాడు ప్రకటన ద్వారా టీడీపీ అధినాయకత్వం, బాలయ్యకీ.. నందమూరి అభిమానులకీ పంపిన సంకేతమేంటి.?
మహానాడు వేదికగా బాలయ్య ప్రసంగం కూడా వుంటుంది. కానీ, ఇదా పద్ధతి.? నందమూరి బాలకృష్ణని అవమానించడమేంటి.? అదంతే.! ఇది కొత్త కాదంతే.!