పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమైనది “స్పిల్ వే” నిర్మాణం. ఈ నిర్మాణం అంతర్భాగమైన గ్యాలరీలో బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు తమ కుటుంబ సభ్యులతో సహా నడవనున్నారు.
“స్పిల్ వే” మొత్తం పొడవు 1,118 మీ. కాగా 48 గేట్లు దిగువ భాగంలో 1 నుండి 48 వ బ్లాక్ వరకు గేలరీ నిర్మాణం సాగింది. బుధవారం “స్పిల్ వే గేలరీ వాక్” కి సీఎం టీడీపీ నాయకులకి పిలుపునిచ్చారు.
పోలవరం హెడ్ వర్క్స్ (జలాశయం)లో స్పిల్ వే గ్యాలరీ పనులు చకచకాసాగుతున్నాయి. అందువల్ల బుధవారం ‘గ్యాలరీ వాక్’ పేరుతో చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి గ్యాలరీ వాక్ ఏర్పాటుచేశారు. ఇందులో మనవడు దేవాన్ష్ కూడా పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సహా అందరినీ ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు వారు పోలవరం వెళ్తున్నారు.
దీనిలో భాగంగా విజయవాడ నుండి పోలవరం సందర్శనకు వెళుతున్న ఎమ్మెల్యేలకు మధ్యలోనే ఆటంకం కలిగింది. ఈ పర్యటనకు టీడీపీ ఎమ్మెల్యేలంతా ఒక బస్సులో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు ఏలూరు సమీపంలో రోడ్డు పక్కన మట్టిలో దిగబడింది. తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు ఎమ్మెల్యేలు.
ఈ బస్సులో 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా ఈ ఎమ్మెల్యేలను వేరే వాహనాల్లో పోలవరం పంపారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. వీడియోలు కింద ఉన్నాయి చూడవచ్చు.