తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు తెలుగు రాజకీయాలను ఏలింది. తనకు తిరిగే లేదన్న శైలిలో వ్యవహరించింది. టీడీపీ అధిరోహించిన శిఖరాలను ఈ ప్రాంతీయ పార్టీ కూడా అందుకోలేదు, భవిష్యత్ లో కూడా ఏ ప్రాంతీయ పార్టీకి అందుకునే శక్తి లేదు. అయితే 2019 ఎన్నికల తరువాత టీడీపీ పరిస్థితి చాలా దయనీయంగా తయారు అయ్యింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేసిన వ్యూహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యొక్క 40 ఏళ్ల రాజకీయ అనుభవం కుదేలైంది. 2019 ఎన్నికలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ ఓటమిని వల్ల పార్టీ యొక్క నేతలు ఇంకా కొలుకోలేదు. ఓటమి వల్ల నాయకుల్లో ఉత్సాహం తగ్గిపోయింది.
సీనియర్స్ నుండి వ్యతిరేకత :
టీడీపీకి చెందిన సీనియర్ నేతలు పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఎంత కష్టపడ్డా కూడా గుర్తింపు లభించడం లేదని, చంద్రబాబు నాయుడు యొక్క మూస విధానాలను తాము ఇంకా పాటించలేమని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్రంలో మళ్ళీ బతకాలన్న, ఇప్పుడున్న నేతల్లో కొత్త ఉత్సాహం రావాలన్నా కూడా పార్టీకి నూతన యువ నాయకుల అవసరం ఉందని గుంటూరు చెందిన ఒక సీనియర్ నేత మొన్న చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పాడని సమాచారం.
లోకేష్ ను కాదని ఎన్టీఆర్ కు బాబు అవకాశం ఇస్తాడా?
వీడియో కాన్ఫరెన్స్ లో ఆ గుంటూరు సీనియర్ నేత చెప్పిన యువ నాయకుడు ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్. ఓటమి వల్ల వచ్చిన నిరుత్సాహం పోవాలంటే పార్టీ పగ్గాలు సీనియర్ ఎన్టీఆర్ వారుసుడైన జూనియర్ ఎన్టీఆర్ కు ఇవ్వాలని పార్టీ లోని పెద్దలు చంద్రబాబు నాయుడికి సలహా ఇస్తున్నారు. నారా లోకేష్ యొక్క శక్తి సామర్ధ్యాలు అందరికి తెలుసు. చెప్పిన మాటను కూడా మళ్ళీ చెప్పలేని లోకేష్ బాబు పార్టీని నడపలేడు. కాబట్టి టీడీపీ సీనియర్ నేతలు పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ కు ఇవ్వాలని, లేదంటే రానున్న రోజుల్లో టీడీపీ భూస్థాపితం కానుందని బాబుకు హితువు పలికారు.