పదవులు కోల్పోయిన టిడిపి నేతులు

తెలుగుదేశంపార్టీ నేతలకు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం పెద్ద షాకే ఇచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్, విప్పులు తదితర తొమ్మిది పోస్టులను రద్దు చేస్తు ఎల్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఉరుములు, పిడుగులు లేకుండా వర్ష పడినట్లుగా పదవులు ఊడబీకుతూ  చీఫ్ సెక్రటరీ  ఉత్తర్వులు జారీ చేయటంతో టిడిపి నేతలు బిత్తరపోయారు.

శాసనమండలిలో చీఫ్ విప్ ఉన్న పయ్యావుల కేశవ్, బుద్ధా వెంకన్న, డొక్కా మాణిక్య వరప్రసాద్ లాంటి వాళ్ళ పదవులను కోల్పోయారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రాజీనామా చేయగానే తొమ్మిది మంది టిడిపి నేతలందరూ పదవులు కోల్పోయినట్లు చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు స్పష్టం చేయటం గమనార్హం.

చంద్రబాబు రాజీనామా చేసినా, తాము పదవుల్లో కొనసాగవచ్చని టిడిపి నేతలందరూ అనుకున్నారు. అయితే వీళ్ళందరికీ పదవులు ఇచ్చిన చంద్రబాబే పదవి కోల్పోయిన తర్వాత ప్రభుత్వ పరంగా సంక్రమించిన పదవుల్లో వీళ్ళెవరూ ఉండేదుకు లేదన్నట్లుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేయటం నిజంగా టిడిపికి పెద్ద షాకే అనుకోవాలి.