వైసిపి వైపు చూస్తున్న టిడిపి సీనియర్  నేతలు

అవును ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత చాలా జిల్లాల్లోని టిడిపి నేతలు వైసిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒకపుడు చంద్రబాబునాయుడు నిర్బంధంగా వైసిపి ఎంఎల్ఏలు, ఎంపిలను ప్రలోభాలకు గురిచేసి టిడిపి లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే. అదే సూత్రాన్ని చాలా జిల్లాల్లో టిడిపి నేతలు రివర్సులో అమలు చేస్తున్నారు.

కాకపోతే తమంతట తామే వైసిపిలోకి వెళ్ళిపోయేందుకు రెడీ అయిపోతున్నారు. అధికారం లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేని రాజకీయాలను చంద్రబాబే అందరికీ అలవాటు  చేశారు. దాని ఫలితంగానే చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం లేని నేతల్లో చాలామంది పార్టీ మారిపోయేందుకు రంగం రెడీ చేసుకుంటున్నారు.

రాష్ట్రంలోని సుమారుగా నాలుగు జిల్లాల్లోని సీనియర్ నేతలు కుదిరితే వైసిపిలోకి లేకపోతే బిజెపిలో చేరటానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. గుంటూరు, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో చాలామంది నేతలు వైసిపి నేతలతో టచ్ లో ఉన్నారు. ఆ విషయాలు తెలిసి చంద్రబాబులో టెన్షన్ మొదలైంది.

అనంతపురం జిల్లాలో జేసి బ్రదర్స్, వరదాపురం సూరి, పరిటాల సునీత కుటుంబం కూడా రెడీ అవుతోందట. అలాగే కర్నూలులో మీనాక్షి నాయుడు, వీరభద్రం గౌడ్, భూమా కుంటుంబం. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని కీలకమైన నేతల్లో చాలామంది వైసిపి వైపు చూస్తున్నారు. విషయం బయటకు పొక్కటంతో చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. నేతలు పార్టీ మారేది నిజమే అయితే టిడిపి దాదాపు ఖాళీ అయినట్లే.