చంద్రబాబు అమెరికా యాత్ర అడ్డుకునేందుకే వారంట్…

 

మహారాష్ట్ర కిందికోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారంట్ మీద  తెలుగుదేశం పార్టీ అనుకున్నట్లుగా ప్రచార యుధ్దం మొదలుపెట్టింది. నిన్న రాత్రి నుంచి టిడిపి నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపిలు విపరీతంగా మీడియాకెక్కి ప్రధాని మోదీ మీద మాటల దాడి ప్రారంభించారు.

విజయవాడలో ఆర్టీసి ఛెయిర్మన్ వర్ల రామయ్య, ఎపి కేశినేని, టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి గొట్టి పాటి రామకృష్ణ ఈ రోజు మోదీ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Varla Ramaiah , RTC Chairman

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎపుడో గోద్రా అల్లర్లును వ్యతిరేకించినందునే ఇపుడు ప్రధాని మోదీ చంద్రబాబు మీద పగ పెంచుకున్నాడని ఒకరు ఆరోపిస్తే, చంద్రబాబునాయుడు ఐక్య రాజ్యసమితిలో మాట్లాడేందుకు అమెరికా వెళ్లకుండా అడ్డుకునేందుకు మోసం ఆయన్ని అరెస్టు చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఇంకొకరు వ్యాఖ్యానించారు.

Keseneni Nani (MP)

ఇది చంద్రబాబుకు ఒక్కడికి వచ్చిన నోటీసు కాదు, అయిదు కోట్ల ఆంధ్రులకు వచ్చిన నోటీ సు అని వారు అంటున్నారు.  రామయ్య, కేశినేని, రామకృష్ణలు ఇంకా ఏమన్నారో చూడండి…

ఏమమయినా సరే కోర్టు అరెస్టు వారంట్ నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు టిడిపి యత్రాంగం మొత్తం కదిలింది. పెద్దాయన పూజలలో నిండా మునిగి ఉన్నందున తమ్ముళ్లు ఈరోజు తెగ రెచ్చిపోయారు. ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ పూజలయ్యాక  వారంట్ మీద స్పందిస్తారని అనుకుంటున్నారు. 

*ఎప్పుడో 8 ఏళ్ల క్రితం 2010లో జరిగింది. దీనిపై కేసులు రద్దుచేశామని మహారాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే ప్రకటించింది. ఇన్నాళ్లు గడిచాక ఇప్పుడు మళ్లీ కేసులు పెట్టడం ఏమిటి?

❖ ఒక ముఖ్యమంత్రికి ఎప్పుడో 8 ఏళ్ల క్రితం జరిగిన దానిపై నాన్ బెయిలబుల్ నోటీసులు ఇవ్వడం దేశ చరిత్రలో జరిగిందా…? దీనినేమంటారు..? రాజకీయ కక్ష సాధింపు కాదంటారా..?

❖ ప్రతిపక్ష నేతగా 10 ఏళ్ల మహారాష్ట్ర, కర్ణాటక అక్రమ ప్రోజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాం.

❖ రైతుల కోసం ఉద్యమాలు చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేస్తారా..? ఒకసారి కేసులు ఎత్తేశామని మహారాష్ట్ర ప్రకటించాక మళ్లీ తప్పుడు కేసులు బనాయిస్తారా..?

Gottipati Ramakrishna

❖ నాలుగేళ్లలో కొత్తరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి ప్రధాని నరేంద్రమోదీకి కంటిగింపుగా మారింది. గతంలో గుజరాత్ మోడల్ అనేవారు, ఇప్పుడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ మోడల్ అనడం చూసి అక్కసు పట్టలేక పోతున్నారు.

❖ ఈ నెల 23న ప్రకృతి సేద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రసంగించాలని ఐక్యరాజ్యసమితి పంపిన ఆహ్వానం చూసి ప్రధాని నరేంద్రమోదీ ఈర్ష్యతో రగిలిపోతున్నారు.

❖ ఏదో విధంగా చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలనే ఈవిధమైన కుతంత్రాలు పన్నుతున్నారు.

❖ 23న అమెరికా వెళ్లకుండా చేసేందుకే 21న ధర్మాబాద్ కోర్టుకు హాజరు కావాలని తప్పుడు కేసు వేయించి నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చేలా చేశారు.

❖ అంతర్జాతీయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిష్ట పెరగడం చూసి నరేంద్రమోదీ, అమితాషా తట్టుకోలేక పోతున్నారు.

❖ నిధులు ఇవ్వకుండా, చట్టం అమలు చేయకుండా, హామీలు నెరవేర్చకుండా చేయడంతో నరేంద్రమోదీ అక్కసు తీరలేదు. ఏదో విధంగా చంద్రబాబును కేసులలో ఇరికించి రాజకీయ కక్ష సాధించాలని కుట్రలు చేస్తున్నారు.

❖ ఈ మహాకుట్రలో తెరవెనుక కుట్రదారులు, పాత్రధారులు గుట్టు రట్టు అయ్యింది. వీరికి తగిన గుణపాఠం ప్రజలే చెబుతారు.