అప్పుడే కొనుగోళ్ళకు తెరలేపిన తెలుగుదేశం పార్టీ.!

రాజకీయాల్లో కొనుగోళ్ళు, అమ్మకాల విషయంలో తెలుగుదేశం పార్టీకి ఘనమైన చరిత్రే వుంది. చంద్రబాబు హయాంలో వైసీపీ నుంచి చాలామంది నాయకుల్ని అలాగే లాగేసిన సంగతి తెలిసిందే. వైసీపీ అయినా, ఇంకో పార్టీ అయినా.. ఈ తరహా రాజకీయాలు చేయకుండా వుండలేని పరిస్థితి. 2024 ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఏడాదిలో ఎన్నికల సందడి షురూ అవుతుంది.

అయితే, అంతకన్నా ముందే.. అంటే ఇప్పుడే ఎన్నికల హంగామా కనిపించేస్తోంది. నెల్లూరు జిల్లా నుంంచి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు సిద్ధంగా వున్నారు. డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగడంలేదు వైసీపీ. మరోపక్క, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ.. ఎప్పుడో వైసీపీకి దూరమైపోయారు.

ఇలాంటి ‘సరుకు’ అంతా టీడీపీలోకే దూకేసే అవకాశాలున్నాయి. మరోపక్క, నారా లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో వైసీపీ నుంచి పెద్దయెత్తున చేరికలు ఎక్కడికక్కడ వుండేలా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నారు.

2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి టిక్కెట్లు దొరకడం కష్టమనుకుంటున్న నేతలు, టీడీపీ వైపుకు చూడటం సహజమే. అయితే, ఇప్పటికిప్పుడు టీడీపీలోకి దూకి సాధించేదేంటి.? అన్న కోణంలో కొందరు గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తున్నారు. మరోపక్క, ‘వేస్ట్ బ్యాచ్’ అనదగ్గ వాళ్ళని వదిలించుకోవడమే బెటర్.. అన్న ఆలోచనతో వైసీపీ వున్నట్లు తెలుస్తోంది. ఇలాంటోళ్ళకి టీడీపీలో మంచి రేటు దొరుకుతోందిట.