కమ్మలే విజనైనా పర్లేదా కన్నా..?

రాజకీయాల్లో శాస్వత శత్రువులు – శాస్వత మిత్రులు ఉండరు అని చెబుతుంటారు. అలా అని దానికంటూ ఒక పరిధి ఉంటుంది – మరీ బరితెగించినట్లుగా చేయకూడదు అనే కామెంట్లూ వినిపిస్తుంటాయి! ఆ సంగతి అలా ఉంచితే.. ఈ నెల 23 న టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన కన్నా లక్ష్మీనారాయణపై సోషల్ మీడియాలో కామెంట్లు మొదలైపోయాయి. అది కూడా మరెవరో కాదు.. ఆయనను అభిమానించేవారు – ఆయన సామాజికవర్గ ప్రజలే!

అవును… ముఖ్యంగా ఉమ్మడి గుంటూరూ – కృష్ణా జిల్లాల్లో కాస్త కేస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎక్కువగా ఉంటాయని అంటుంటారు! ముఖ్యంగా కమ్మ – కాపు సామాజికవర్గాల్లో ఇది కాస్త బహిరంగంగా కనిపిస్తుందనే కామెంట్లు కూడా వినిపిస్తుంటాయి. అందులో భాగమో ఏమో కానీ… గతంలో కన్నా లక్ష్మీ నారాయణ.. బాబు పై ఒక కామెంట్ చేశారు. “నీకు విజనూ లేదు.. బొందా లేదు. కమ్మలే నీవిజన్” అంటూ అసెంబ్లీలోనే దుమ్మెత్తి పోసిన పరిస్థితి! ప్రస్తుతం ఇదే విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు!

“చంద్రబాబుకు కమ్మలే విజన్ అయితే.. మరి కాపు సామాజికవర్గం ఎంతో అభిమానించే కన్నా లక్ష్మీనారాయణ అనబడే మీరు.. బాబు తో దోస్తీ అని ఎలా” అన్నారనేది కన్నా ఆన్ లైన్ అభిమానుల ఆవేదన!

ఇదే క్రమంలో… నేడు ఏపీలో ప్రజాస్వామ్యం లేదని, పోలీసు రాజ్యం నడుస్తుందని చెబుతున్న కన్నాకు మరో బైట్ చూపిస్తున్నారు నెటిజన్లు! 2018లో జీవో నెం. 109 ను జారీచేసి సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వమని చెప్పడం సిగ్గుచేటని అప్పట్లో బాబుపై నిప్పులు చెరిగారు. అనంతరం… చంద్రబాబు మానసిక వ్యాదితో బాదపడుతున్నారని.. చంద్రబాబుకు – వేర్పాటువాదులు – నక్సలైట్లకు తేడాలేదని.. బాబు దేశద్రోహ చర్యలు సిగ్గుచేటని అప్పట్లో మండిపడ్డారు!

మానసిక వ్యాదితో బాదపడుతూ.. దేశద్రోహ చర్యలకు పాల్పడుతూ.. కమ్మవిజన్ మాత్రమే ఉన్న బాబుతో కన్నా సవాసం ఎలా చేస్తారనేది ఆయన అభిమానుల మరో ప్రశ్న!

సరే ఏది ఏమైనా.. తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసైనికుల ఆశలపై నీళ్లు చల్లిన కన్నా.. రేపు (23-02-23) న సైకిల్ ఎక్కబోతున్నారు! ఆ సంగతులు అలా ఉంటే… “ఇవన్నీ నేటి రాజకీయాల్లో అత్యంత సహజం అని సరిపెట్టుకోకుండా.. ఎందుకొచ్చిన కామెంట్లు ఇవన్నీ”.. అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు!