టీడీపీ, జనసేన పంపకాల లెక్క ఎంత.?

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఏంటో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నాయ్. చంద్రబాబు అరెస్టయితే రాష్ర్టంలో టీడీపీ శ్రేణులు పెద్దగా అల్లరి చేయలేదు.

ఇంకో పక్క పవన్ కళ్యాణ్ పెద్ద షో చేశారు. ఇంకేముంది.! టీడీపీ, జనసేన కూటమికి సంబంధించి, సీట్ల పంపకాల్లో పవన్ కళ్యాణే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని జనసేన శ్రేణులు అనుకున్నాయ్.

కానీ మరుసటి రోజుకే సీను మారిపోయింది. దేశ విదేశాల్లో టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయ్. జాతీయ నాయకులు స్పందిస్తున్నారు. సినీ ప్రముఖులూ స్పందించడం మొదలు పెట్టారు.

ఈ పరిస్థితిని జాగ్రత్తగా విశ్లేషించుకున్న జనసేనాని, టీడీపీని తక్కువంచనా వేయొద్దంటూ జనసేన శ్రేణులకు సూచించారు.

75, 75, 25.. ఇలా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పంపకాలు వుంటాయని జన సైనికులు అనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే ఆలోచన చేసి వుండొచ్చు. కానీ, ఇప్పుడు సీను మారింది.

100 సీట్లకు తగ్గకుండా టీడీపీ పోటీ చేస్తుంది. జనసేన 60 సీట్లకే పరిమితం కావచ్చు. బీజేపీ ఓ 15 సీట్ల వరకూ ట్రై చేయొచ్చు. అదీ టీడీపీ దయా దాక్షిణ్యాలతో. బెయిల్ కోసం స్పందించాల్సిన స్థాయిలో చంద్రబాబు స్పందించనిది ఈ సింపథీ కోసమే.