వైసీపీ దారిలో టీడీపీ, జనసేన.. సంక్షేమ పథకాలు మాత్రమే దిక్కా?

TDP is using Janasena

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ సంక్షేమ పథకాల అమలు విషయంలో మంచి పేరును సొంతం చేసుకుంది. జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను చూసి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని పథకాలను అమలు చేయగలదా అని చాలామంది సందేహాలను వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఈ సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన టీడీపీ, జనసేనలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

టీడీపీ, జనసేన సైతం సంక్షేమ పథకాల అమలు విషయంలో వైసీపీని ఫాలో కావాలని ఫిక్స్ అయ్యాయని తెలుస్తోంది. అయితే కొత్త పథకాలను ప్రకటిస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన ఈ పార్టీలలో జనసేన తమ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇవే పథకాలను అమలు చేస్తామని చెబుతుండటం గమనార్హం. టీడీపీ మాత్రం ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని ఆ అభిప్రాయాల ఆధారంగా పథకాలను అమలు చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్నికల్లో విజయం సాధించాలంటే తమ పార్టీలకు సంక్షేమ పథకాలు మాత్రమే దిక్కు అని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అయితే అభివృద్ధి లేని సంక్షేమ పథకాల అమలు వృథా అని ప్రజల్లో భావన ఉంది. ఏపీలోని రోడ్లు, రాజధాని అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి, రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు, కనీస మౌలిక సదుపాయాల కల్పన దిశగా అడుగులు వేయాల్సి ఉంది.

అయితే అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా తాత్కాలికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా భవిష్యత్తులో మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. సంక్షేమ పథకాల అమలు వల్ల రాష్ట్రంపై అప్పుల భారం అంతకంతకూ పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.