ఇదిగో ఉదాహరణ… డబ్బుంటే టీడీపీలో ఎన్ని టిక్కెట్లు కావాలంటే అన్ని!

ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని అంటారు. ఇదే సమయంలో… “సొమ్ముల్లేనివారు పాటించేందుకే టీడీపీలో రూల్స్ ఉన్నాయి… డబ్బులున్న మనిషికే టీడీపీలో ఎన్ని టిక్కెట్లయినా ఉన్నాయి” అని అంటున్నట్లున్నారు చంద్రబాబు! ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అది అక్షర సత్యం, ఆచరణ సత్యం అని అంటున్నారు పరిశీలకులు. తాజాగా కేవలం రెండు కుంటుంబాలకు చెందిన వ్యక్తులు చెరో నాలుగు టిక్కెట్లు తీసుకోవడం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.

అవును… “టీడీపీలో ఒక్క కుటుంబానికి ఒక్క టిక్కెట్ మాత్రమే” ఇది చంద్రబాబు ఇచ్చిన స్టేట్ మెంట్ గా చెబుతారు. దీంతో టీడీపీకి వెన్నుముఖగా నిలిచిన ఫ్యామిలీలు సైతం అర్ధం చేసుకునో, అలిగో సర్ధుకున్నాయి. ఒక్కో కుటుమాబానికి ఒక్క టిక్కెట్ మాత్రమే దక్కించుకున్నాయి. పరిటాల ఫ్యామిలీ అయినా, జేసీ బ్రదర్స్ అయినా, అయ్యన్నపాత్రుడు అయినా… ఎవరైనా పార్టీ పెట్టినప్పటినుంచీ బ్యాక్ బోన్ గా ఉన్నవారికి సైతం ఒక్కో టిక్కెట్ మాత్రమే దక్కింది.

ఇదే సమయంలో పార్టీకి ఎంతో కాలంగా పనిచేస్తున్న కీలక నేతలు, సీనియర్లలో కొంతమందికి టిక్కెట్టే దక్కలేని పరిస్థితి. దీంతో… తామంతా ఏమి పాపం చేశాము, నిబద్ధతగా పార్టీకి పనిచేయడమే చేసిన తప్పా.. లేక, పార్టీ పేరు చెప్పుకుని కోట్లు వెనకేసుకోకపోవడమే తాము చేసిన నేరమా అన్న స్థాయిలో ఫైరవుతున్నారని తెలుస్తుంది.

పోనీ ఒకటికంటే ఎక్కువ టిక్కెట్లు దక్కించుకున్నవారు పార్టీకి అంత గొప్ప నాయకులా అంటే… డబ్బునవారని, ఎంత డబ్బైన ఖర్చు పెట్టగలవారని, చంద్రబాబు చేసిన చాలా పనుల్లో క్రియాశీలకంగా పనిచేసినవారని అంటున్నారు. ఉదాహరణకు ఏలూరు ఎంపీ టికెట్ ని కడప జిల్లాకు చెందిన మహేష్ యాదవ్ కి కట్టబెట్టారు. దీంతో… ఇంతకాలం ఏలూరులో పార్టీని నడిపించిన వ్యక్తి పరిస్థి ఏమిటి? ఎందుకయ్యా అంటే… పక్కనుంచి “పైసామే పరమాత్మ అనే సౌండ్స్ వస్తున్నాయి”!

ఏలూరు టీడీపీ ఇన్ ఛార్జ్ గోపాల్ యాదవ్ అయితే… సోషల్ మీడియా ముఖంగా జగన్ కి క్షమాపణలు చెప్పారు. బీసీలకు న్యాయం చేయడంతో వైసీపీయే బాగుందని స్పష్టం చేశారు. పాతిక ఎంపీ సీట్లలో ఎస్సీ, ఎస్టీలకు 5 సీట్లు పోగా.. మిగిలిన వాటిలో ప్రకటిచిన 19లో 11 సీట్లు బీసీలకు ఇచ్చిన జగన్ ని శభాష్ అంటున్నారు. ఆయన తన కార్యకర్తలతో మాట్లాడి వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు… మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు మాత్రం తనదైన పెర్ఫార్మెన్స్ చూపించాడు. ఎన్ టీఆర్ ని దింపినప్పుడు బాబుతో పాటు కీలకంగా ఉన్న వ్యక్తుల్లో యనమల కీలకం అని చెబుతారనే సంగతి కాసేపు పక్కనపెడితే… ఫుల్ గ్రిప్ సంపాదించాడు. ఇందులో భాగంగా… ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వగా.. కుమార్తె దివ్యకు తుని అసెంబ్లీ టికెట్.. అల్లుడు మహేష్ యాదవ్ కి ఏలూరు ఎంపీ టికెట్.. వియ్యంకుడు సుధాకర్ కి కడప జిల్లా మైదుకూరు టికెట్ దక్కింది.

చంద్రబాబు ఫ్యామిలీ విషయానికొస్తే… కుప్పం, మంగళగిరి, హిందూపురం లో వరుసగా చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ పోటీ చేస్తుండగా.. విశాఖ ఎంపీ టిక్కెట్ బాలకృష్ణ అల్లుడికి దక్కింది! దీంతో… ఈ విషయం కూడా టీడీపీలో అంతర్లీనంగా అగ్గి రాజేస్తుందని అంటున్నారు. ప్రధానంగా పార్టీ జెండా మోసిన నేతలకు చివరి నిమిషంలో మొండిచెయ్యి చూపించడంతో వారంతా గుర్రుగా ఉన్నారని అంటున్నారు. పైగా బీసీలకు పూర్తిగా అన్యాయం చేశారని చెబుతున్నారు.

దీంతో… నిజంగానే జగన్ అన్నట్లు ఈసారి జరగబోయే ఎన్నికలు క్లాస్ వార్ అన్నట్లుగానే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది వేచి చూడాలి!