పెళ్లి .. జీవితంలో ఒకే ఒకసారి జరిగే అతి ముఖ్యమైన వేడుక. రాజకీయ భారీ ఎత్తున పెళ్లిళ్లు చేస్తుంటారు. ప్రముఖులంతా పెళ్ళికి హాజరవుతుంటారు. ఇదంతా కరోనాకు ముందు. కరోనా వచ్చిన ఆతరువాత కాలం మారిపోయింది. పరిమిత సంఖ్యలోనే పెళ్ళికి ఆహ్వానిస్తున్నారు. సింపుల్ గా పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. జనవరి 2న తన కుమార్తె సాయి నవ్యశ్రీ వివాహానికి ఎవరూ రావొద్దని ఆయన కోరాల్సి వచ్చింది. కరోనా నిబంధనలు కారణమని.. ఆహ్వాన పత్రికతోపాటు అందించిన స్వీట్ బాక్సు వెనుకే ఈ సందేశాన్ని ముద్రించారు.
వచ్చే నెల 2న తన కుమార్తె సాయి నవ్య శ్రీ వివాహానికి సుమూర్తం నిశ్చయించారని.. శ్రేయాభిలాషులైన అందర్ని ఆహ్వానించి, నూతన దంపతులకు ఆశీస్సులు అందించమని కోరడానికి కరోనా నియమ నిబంధనలు ఆటంకంగా ఉన్న విషయం తెలిసిందే అన్నారు. అందుకే పరిస్థితుల్ని గమనించి, సహృదయంతో వారి, వారి ఇళ్ల నుంచి నూతన వధూవరులకు శుభాశీస్సులు అందించాలని కోరుతున్నారు.