ఆ జిల్లాలో పవన్ లెక్క తేల్చిన తెలుగు తమ్ముళ్లు

పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయంగా చాలా చైతన్యవంతమైంది. నేను ఒక్క మాట చెప్పినందుకు 15 సీట్లు ఇచ్చి టీడీపీకి అండగా నిలబడ్డారు -పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలకి తెలుగు తమ్ముళ్లు లెక్కలు చూపించి మరీ రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. గతంలో పవన్ సపోర్ట్ లేకుండానే టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని సీట్లు సంపాదించిందో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. కింద ఒక టీడీపీ కార్యకర్త పెట్టిన పోస్టును చూడవచ్చు.

“మీరు 2014 లో కలవక ముందు జిల్లా ప్రజలు ZPTC ఎన్నికలలో TDP కి ఇచ్చిన సీట్స్ ఒక్కసారి చూడండి పవన్ సర్. Total: 46 (TDP – 43, YSRCP-3)

తెలుగుదేశం కంచుకోట పశ్చిమగోదావరి జిల్లా:
1983, 1985, 2014 లో జిల్లాలో అన్ని స్థానాలు తెలుగుదేశం గెలుచింది ..
1994, 1999 లో జిల్లాలో 16 స్థానాలు కి 15 స్థానాలు తెలుగుదేశం గెలిచింది..

తెలుగుదేశం ఓడిపోయిన 1989 లో పశ్చిమగోదావరి లో 8 సీట్లు తెలుగుదేశం గెలిచింది. 2004 లో రాష్ట్ర వ్యాప్తంగా 45 సీట్లు తెలుగుదేశం గెలుస్తే అందులో 5 సీట్లు పశ్చిమగోదావరి నుంచి గెలిచింది. 2009 లో రాష్ట్రములో తెలుగుదేశం ఓడిపోయిన జిల్లాలో 5 సీట్లు గెలిచింది.

నీ అన్నని చిత్తుగా ఓడించింది పశ్చిమగోదావరి జిల్లా. 2009 లో మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారుగా పాలకొల్లుకి. నీ అన్ననే గెలిపించలేని నువ్వు మా పార్టీ ని గెలిపించావు అంటే నమ్మాలి.

నేనే గెలిపించా అని మా జిల్లా వాళ్ళ ఇగో హర్ట్ చెయ్యకు. నీ దూల తీర్చేస్తారు. మొన్నే మా దెందులూరు MLA ఛాలెంజ్ చేశారు. అంత దమ్ముంటే ఈ సారి 2019 లో దెందులూరు వచ్చి పోటీ చెయ్యి. నీకు దూల తీరకపోతే చూడు. పక్కకి వెళ్లి ఆడుకోమ్మా…..”