13 జిల్లాలో టీడీపీకి వరుస రాజీనామాలు.. సక్సెస్ అనుకుంటున్న చంద్రబాబు 

TDP Christian cell presidents resignations 
ఆంధ్రప్రదేశ్ నందు మాట రాజకీయ జోరుగా నడుస్తోంది.  విమర్శలే కాదు పార్టీల్లో లెక్కలు కూడ మాట ప్రాతిపదిక జరుగుతున్నాయి.  ఇన్నాళ్లు తమను దూషిస్తే కులాలు ఆగ్రహించేవి.  కానీ ఇప్పుడు మతాలు నొచ్చుకుంటున్నాయి.  ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ నడుమ హిందూత్వం, క్రిస్టియానిటీ అనే వాదులాట నడుస్తోంది.  వైఎస్ జగన్ ఉద్దేశ్యపూర్వకంగానే హిందూ మతం మీద దాడులు చేస్తున్నారని, జగన్ అనుగ్రహం కోసం ఆ పార్టీ నేతలు హిందూత్వానికి ముప్పు తలపెడుతున్నారని చంద్రబాబు ఆరోపణ.  జగన్ తన మతమైనా క్రిస్టియానిటీని రాష్ట్రంలో వ్యాప్తి చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డారు.  ఎన్నడూ లేని విధంగా మరొక మతం మీద నిప్పులు చెరిగారు. 
 
TDP Christian cell presidents resignations
ఇది వైసీపీ మీద ప్రభావం చూపిందో లేదో తెలీదు కానీ టీడీపీ మీద మాత్రం బాగా పనిచేసింది.  తమను అవమానించినందుకుగాను తెలుగుదేశం పార్టీలోని క్రిస్టియన్ కమ్యూనిటీ బాగా నొచ్చుకుంది.  అందుకే క్రిస్టియన్ నేతలంతా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.  మొత్తం 13 జిలాల్లో ఉన్న క్రిస్టియన్ సెల్ అధ్యక్షులందరూ రాజీనామాలు చేస్తున్నారు.  నామినేటెడ్ పోస్టులు పొందినవారు కూడ తమను చంద్రబాబు అవమానించారని అంటూ తట్టాబుట్టా సర్దుకుంటున్నారు.  క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ చంద్రబాబు తప్పచేశారని, తమను కించపరిచేలా మాట్లాడారని అందుకే మూకుమ్మడి రాజీనామాలని అంటున్నారు. 
 
అయితే ఇలా క్రిస్టియన్ నేతలంతా రాజీనామాలు చేస్తున్న టీడీపీ అధినాయకత్వానికి చీమకుట్టినట్టు కూడ అనిపించట్లేదు.  ప్రధాన నేతలంతా  వేడుక చూస్తున్నట్టు చూస్తున్నారు.  బయటపడట్లేదు కానీ కొందరు లీడర్లైతే ఈ రాజీనామాల పట్ల సంతోషంగా ఉన్నారు.  జగన్ కు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన మతస్తులు పార్టీలో ఉండకపోవడం మంచిదని, అప్పుడే పూర్తిగా హిందూత్వ ఎజెండాను భుజానికెత్తుకున్నట్టు ఉంటుందని అనుకుంటున్నారట.  ఇది పక్కా బీజేపీ ఫార్ములా.  బీజేపీలో కూడ బయటి మతస్తులకు పెద్దగా చోటు ఉండదు.  హిందూత్వం పేరుతో పర మతాలను దూరం పెట్టే తత్త్వం వారిది.  అదే వారిని నిలబెడుతోంది కూడ.  ఇప్పుడు చంద్రబాబు  సైతం అలాంటి కరుడుగట్టిగా పద్ధతినే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు.