చంద్రబాబు తండ్రి ఓ దొంగ.! మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.!

TDP

రాజకీయాల్లో విమర్శల తీవ్రత రోజురోజుకీ అత్యంత అసహస్యమైన స్థితికి వెళ్ళిపోతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డిని ఫ్యాక్షనిస్టు, హంతకుడు.. దగాకోరు.. అంటూ టీడీపీ ఆరోపించడం చూస్తూనే వున్నాం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే క్రమంలో రాజశేఖర్ రెడ్డి పేరునీ, రాజారెడ్డి పేరునీ ప్రస్తావిస్తుంటారు టీడీపీ నేతలు. ఈ మధ్య వైఎస్ జగన్ సతీమణి భారతి పేరుని కూడా టీడీపీ లాగుతోంది.

‘ఇలాగైతే ఎలా.? మీరు కౌంటర్ ఎటాక్ చేయకపోతే కష్టం..’ అంటూ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సహచర మంత్రులకు క్లాస్ తీసుకోవడంతో, రావాల్సిన స్థాయిలోనే కౌంటర్ ఎటాక్ వచ్చిందని అనుకోవాలేమో. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు తండ్రి ఖర్జూర నాయుడు (ఈ పేరు చాలామందికి తెలియదుగానీ, పదే పదే మాజీ మంత్రి కొడాలి నాని ఈ పేరుని ప్రస్తావిస్తుంటారు.) ఓ దొంగ.. అని కాకాణి విమర్శించారు.

‘రాత్రి వేళ వేరు శనగల బస్తాల్ని మీ నాన్న ఖర్జూర నాయుడు దొంగిలించేవాడు.. మీ చరిత్ర మాకు తెలియదా చంద్రబాబూ.?’ అంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కాకాణి విమర్శలపై టీడీపీ ఎలా స్పందిస్తుందోగానీ, ‘కుక్క కాటుకి చెప్పుదెబ్బ..’ అని వైసీపీ శ్రేణులు ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తుండడం గమనార్హం.

వైఎస్ జగన్‌ని విమర్శించే క్రమంలో ఆయన కుటుంబ సభ్యుల్ని లాగడం టీడీపీ చేసిన తప్పు. అదే తప్పుని, వైసీపీ కూడా చేస్తుండడాన్ని సమర్థించలేం. రాజకీయాల్లో హుందాతనం అవసరం. అసలది లేకపోతేనే రాజకీయం.. అన్నట్టు తయారైంది పరిస్థితి.

ఇంతకీ, ఖర్జూర నాయుడు నిజంగానే దొంగా.? ఏమో, టీడీపీ ఈ విషయమై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.