బాబుకు బ్యాడ్ న్యూస్… పవన్ కాన్ఫిడెన్స్ పై కొత్త చర్చ ఇదే!

రాజకీయంగా ఏ విషయంపై అయినా స్పష్టత కలిగి ఉండే విషయంలో పరిపూర్ణమైన అస్పష్టత కలిగి ఉంటారనే పేరు సంపాదించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు ఇప్పుడు టీడీపీ నేతలను. మరి ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబును తీవ్ర టెన్షన్ కు గురిచేస్తుందని అంటున్నారు పరిశీలకులు.

పవన్ కల్యాణ్ రాజకీయాలను రెండు పార్శ్వాలుగా పరిగణిస్తున్న విశ్లేషకులు… వారాహి యాత్రకు ముందు ఒకలెక్క వారాహి యాత్ర తొలివిడత ముగిసిన అనంతరం మరో లెక్క అన్నట్లుగా పవన్ వ్యవహార శైలేకాని, ఆయన నడుచుకునే విధానంగాని, ఆయన ఆలోచనా విధానం గానీ ఉన్నాయని అంటున్నారు. అయితే ఇది జనసైనికులకు గుడ్ న్యూస్ గా ఉండగా… టీడీపీ అధినేతకు మాత్రం బ్యాడ్ న్యూస్ గా మారిందని అంటున్నారు.

వారాహియాత్ర ప్రారంభానికి ముందు… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. ఒంటరిగా పోటీచేసి వీరమరణం పొందే పరిస్థితి ఉండకూడదు.. ఈసారి బలవ్వడానికి జనసేన సిద్ధంగా లేదు.. గౌరవప్రధమైన సీట్లు ఇస్తే (టీడీపీతో) పొత్తు ఉంటుంది అన్నట్లుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది. అయితే ఇది వారాహియాత్రకు ముందు వెర్షన్.

“ఎన్నిక‌ల్లో పొత్తుల గురించి ఆలోచించుకునేందుకు ఇంకా స‌మ‌యం ఉంది. ఒంట‌రిగా వెళ్లాలా, క‌లిసి ప్ర‌యాణించాలా అనేది ఇప్పుడు నిర్ణ‌యించేది కాదు. మండ‌ల స్థాయిలోనూ స‌మ‌గ్ర అధ్య‌య‌నం చేశాకే పొత్తుల‌పై తుది నిర్ణ‌యం తీసుకుంటాం”… ఇది వారాహియాత్రలో భాగంగా జనసేనాని చెప్పినమాట.

ఇదే సమయంలో పొత్తుల‌పై మాట్లాడాల్సిన స‌మ‌యం ఇది కాద‌ని అంటున్న పవన్… పార్టీని బ‌లోపేతం చేయ‌డం మానేసి, పొత్తుల‌నే న‌మ్ముకుని రాజ‌కీయాలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు గ్రామస్థాయికి కాకపోయినా.. కనీసం మండల స్థాయిలో అయినా పార్టీని ని బలోపేతం చేసుకుని.. వారాహి యాత్రలో స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని.. ఆనాక పొత్తుల గురించి ఆలోచించాలని పవన్ భావిస్తున్నారంట.

ఇదే సమాయంలో గోదావరి జిల్లాల్లో మొత్తం 34 స్థానాల్లోనూ జనసేనే పోటీ చేస్తాది.. పొత్తులు ఉంటే మాత్రం పదో పరకో సీట్లు భాగస్వామ్య పార్టీలకు ఇస్తాం అన్నస్థాయిలో జనసేన కీలకనేత బొలిశెట్టి లాంటి వారు వ్యాఖ్యానించిన విషయాలను కూడా ఈ సందర్భంగా విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఇదే ఇప్పుడు టీడీపీ అధినేతను ఆందోళనకు గురిచేస్తుంది.

ఏదోలా గెలవాలని సొంత పార్టీ నేతలను కూడా త్యాగాలమాటున బలిపశువులను చేసి జనసేనాని కోసం తగ్గుతుంటే… పవన్ వారాహి యాత్రలో కనిపించిన వాపుని బలం అనుకుంటున్నారని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారంట. దీంతో… టీడీపీ – జనసేన పొత్తుల వ్యవహరాం ఇప్పట్లో తేలేది కాదని… ఎవరు తగ్గడం అనే విషయంపైనే ఆ పొత్తు పొడవడం ఆధారపడి ఉంటుందని అంటున్నారు.